సినిమా వార్తలు

5 రోజుల్లో రూ.241 కోట్ల క్లబ్‌లో ‘పెద్ది’.. సోమవారం టెస్ట్‌లోనూ సక్సెస్!

Published by
Srinivas

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా దూసుకుపోతోంది. ఎక్స్‌టెండెడ్ ఓపెనింగ్ వీకెండ్‌లో భారీ వసూళ్లు సాధించిన ఈ చిత్రం, కీలకమైన సోమవారం టెస్ట్‌ను కూడా విజయవంతంగా పూర్తి చేసింది.

ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, సోమవారం ఒక్కరోజే ఈ చిత్రం దేశవ్యాప్తంగా సుమారు రూ.14 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. అలాగే బుక్‌మైషోలో దాదాపు 1.74 లక్షల టికెట్లు అమ్ముడవ్వడం ప్రేక్షకుల్లో చిత్రంపై కొనసాగుతున్న ఆసక్తికి నిదర్శనంగా నిలిచింది.

సోమవారం కలెక్షన్లతో కలిపి ‘పెద్ది’ భారతదేశంలో రూ.201 కోట్ల గ్రాస్ మార్క్‌ను దాటింది. ఇక ఓవర్సీస్‌లో సుమారు రూ.40 కోట్ల గ్రాస్ వసూలు చేసిన ఈ చిత్రం, కేవలం 5 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.241 కోట్ల గ్రాస్ సాధించి సత్తా చాటింది.

అయితే అన్ని ప్రాంతాల్లో ఒకే స్థాయిలో వసూళ్లు రావడం లేదు. హిందీ వెర్షన్ ఆశించిన స్థాయిలో రాణించకపోగా, తెలంగాణలో కూడా కలెక్షన్లు అంచనాలకు కొంత తక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది. కానీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఈ చిత్రం అద్భుతమైన వసూళ్లతో దూసుకుపోతోంది.

బుచ్చి బాబు సన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని వెంకటేష్ కిలారు నిర్మించారు. చిత్రంలో జాన్వీ కపూర్, శివరాజ్, జగపతి బాబు కీలక పాత్రలు పోషించారు.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.