Download App

Poonam Kaur: బాలకృష్ణపై పూనమ్ కౌర్ ట్వీట్ వైరల్

సెప్టెంబర్ 30, 2025 • By Rahul N
‘మాయాజాలం’ సినిమాతో తెలుగు తెరపై హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన పూనమ్ కౌర్ (Poonam Kaur), తర్వాత ‘ఒక విచిత్రం’, ‘శౌర్యం’, ‘వినాయకుడు’, ‘నాగవల్లి’ వంటి చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గరైంది. తెలుగు మాత్రమే కాకుండా తమిళం, మలయాళం, హిందీ భాషల్లోనూ నటించి తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది. అయితే సినిమాల కంటే...
Poonam Kaur: బాలకృష్ణపై పూనమ్ కౌర్ ట్వీట్ వైరల్

‘మాయాజాలం’ సినిమాతో తెలుగు తెరపై హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన పూనమ్ కౌర్ (Poonam Kaur), తర్వాత ‘ఒక విచిత్రం’, ‘శౌర్యం’, ‘వినాయకుడు’, ‘నాగవల్లి’ వంటి చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గరైంది. తెలుగు మాత్రమే కాకుండా తమిళం, మలయాళం, హిందీ భాషల్లోనూ నటించి తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది.

అయితే సినిమాల కంటే ఎక్కువగా పూనమ్ సోషల్ మీడియాలో చేసే కాంట్రవర్సీ ట్వీట్లు కారణంగానే ఎక్కువగా హాట్ టాపిక్‌గా మారుతుంటుంది. ఆమె చేసే ఏ పోస్ట్ అయినా క్షణాల్లో వైరల్ అవ్వడం సహజమే. తాజాగా ఆమె నందమూరి బాలకృష్ణ గురించి చేసిన ట్వీట్ నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది.

బాలయ్యపై పొగడ్తల వర్షం

తాజాగా పూనమ్, గతంలో చేసిన ఓ ట్వీట్‌ను రీపోస్ట్ చేస్తూ, “బాలయ్య(Balakrishna) చిన్న పిల్లాడిలా ఎనర్జీతో ఉంటారని నేను ఎప్పుడూ చెబుతుంటాను. దేవుడు కొందరు వ్యక్తుల్ని ఓ లక్ష్యం కోసం సాధనంలా సృష్టిస్తాడు. అది టైంను బట్టి బయటపడుతుంది” అని పేర్కొంది.

ఇక ఓ వేడుకలో, ‘సమర సింహారెడ్డి’ సినిమాలోని “నందమూరి నాయకా అందమైన కానుకా…” పాటకు పూనమ్ డ్యాన్స్ చేస్తుండగా, బాలయ్య హర్షధ్వానాలు చేస్తూ చూసిన వీడియోను ఆమె తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో షేర్ చేసింది. ఆ వీడియోతో పాటు బాలయ్యపై ప్రశంసల జల్లు కురిపించింది.

“బాలయ్య మహా వృక్షం”

పూనమ్ తన పోస్ట్‌లో, “బాలయ్య మహా వృక్షం లాంటి వారు. ఆ వృక్షం ఎల్లప్పుడూ మనుషులు, జంతువులకు నీడనిస్తూనే ఉంటుంది. ‘ఆదిత్య 369’ నుంచి ‘భగవంత్ కేసరి’ వరకు ఆయన చిన్న పిల్లాడిలా ఎనర్జీతో కనిపిస్తారు. అది ఆయనకు భగవంతుడు, తండ్రి ఎన్టీఆర్ ఇచ్చిన ఆశీర్వాదం” అని రాసింది.

ఫ్యాన్స్ పాజిటివ్ రియాక్షన్

నందమూరి అభిమానులు పూనమ్ చేసిన ఈ ట్వీట్‌ను విపరీతంగా షేర్ చేస్తున్నారు. “బాలయ్య ఎనర్జీని నిజంగా బాగా డిస్క్రైబ్ చేసింది” అంటూ అభిమానులు సోషల్ మీడియాలో పాజిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading