సినిమా వార్తలు

భారీ హవేలీ సెట్‌తో ప్రభాస్ ‘రాజా సాబ్’ – హారర్ సినిమాల్లో వినూత్న రికార్డు

Published by
Rahul N

రొమాంటిక్ హారర్ కామెడీ జానర్‌లో రూపొందుతున్న రాజాసాబ్ సినిమాకు సంబంధించి తాజా అప్‌డేట్‌లు ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగిస్తున్నాయి.

రెబల్ స్టార్ ప్రభాస్, దర్శకుడు మారుతి, మరియు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కలిసి చేస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘రాజా సాబ్’ ఇప్పుడు భారీ అంచనాలను నెలకొల్పుతోంది.

ఈ చిత్రం డిసెంబర్ 5న తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్‌గా విడుదల కానుంది. ప్రభాస్ ఈ జానర్‌లో తొలిసారి నటిస్తున్నాడన్న విషయమే కాక, ఈ సినిమా కోసం వేసిన భారీ హవేలీ సెట్ మరింత హైప్‌ను క్రియేట్ చేసింది.

ప్రసిద్ధ ఆర్ట్ డైరెక్టర్ రాజీవన్ నంబియార్ నేతృత్వంలో నిర్మించిన ఈ హవేలీ సెట్ దాదాపు 41,256 చదరపు అడుగుల విస్తీర్ణంలో రూపొందించబడింది. ఇది ఇండియన్ సినిమా హిస్టరీలో హారర్ సినిమాకు నించిన ఎప్పటికీ అతిపెద్ద సెట్గా నిలవనుంది.

రాజీవన్ మాట్లాడుతూ –“హవేలీలో ప్రతి మూల నుంచీ ఒక ఎమోషన్ కనిపిస్తుంది. ఇది కేవలం హాంటెడ్ హౌస్ లా కనిపించదు, ఆ ఇంట్లో మనం జీవిస్తున్న అనుభూతిని కలిగిస్తుంది. ఇది ప్రేక్షకులను కథలోకి లీన్ చేసేట్టు డిజైన్ చేశాం,” అని పేర్కొన్నారు.

ఈ సెట్‌ను నేషనల్, స్టేట్ మీడియా ప్రతినిధులకు జూన్ 16 సోమవారం నాడు అధికారికంగా చూపించనున్నారు. అదేరోజు సినిమా టీజర్‌ను కూడా విడుదల చేయనున్నారు.

దర్శకుడు మారుతి ఈ సినిమాను హారర్ కామెడీ జానర్‌లో ఎవర్‌గ్రీన్ క్లాసిక్‌గా నిలిచిపోయేలా తెరకెక్కిస్తున్నాడు. టీజీ విశ్వప్రసాద్ అధ్వర్యంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాను అన్‌కాంప్రమైజ్డ్ ప్రొడక్షన్ వ్యాల్యూస్తో నిర్మిస్తోంది.

హారర్ కామెడీతో కూడిన సినిమాల కోసం ఎదురుచూస్తున్న ప్రభాస్ అభిమానులకు “రాజా సాబ్” ఒక విజువల్ ట్రీట్గా మారనుంది.

Rahul N