టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నటిస్తున్న యూనిక్ ఎంటర్‌టైనర్ ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ షూటింగ్ హైదరాబాద్‌లో జోరుగా సాగుతోంది. మహేష్ బాబు పి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు.
ప్రస్తుతం హైదరాబాద్‌లోని అల్యుమినియం ఫాక్టరీలో కీలక టాకీ పార్ట్‌ను చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్‌లో రామ్‌తో పాటు కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్ర పాల్గొంటున్నారు. చిత్రంలో ఉపేంద్ర, పవర్‌ఫుల్ పాత్ర సూపర్ స్టార్ సూర్యకుమార్‌గా కనిపించనుండగా, రామ్ ఆయన ఫ్యాన్ పాత్రలో కనిపించబోతున్నారు. ఈ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సన్నివేశాలు సినిమాకు ప్రధాన హైలైట్‌గా నిలవనున్నాయి.
ఇటీవల రామ్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన టైటిల్ గ్లింప్స్‌కు ట్రెమండస్ రెస్పాన్స్ లభించింది. ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ సినిమాలో రామ్ తన కెరీర్‌లో ఇప్పటివరకు చేయని యూనిక్ క్యారెక్టర్ చేస్తున్నట్లు చిత్రబృందం పేర్కొంది. దర్శకుడు మహేష్ బాబు పి ఈ సినిమాకు ఓ విభిన్న కథను అందించారని తెలుస్తోంది.
భాగ్యశ్రీ బోర్స్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి సిద్ధార్థ నూని సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, సంగీతాన్ని వివేక్-మర్విన్ కలిపి అందిస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రొడక్షన్ డిజైనర్‌గా అవినాష్ కొల్లా పని చేస్తున్నారు.
అద్భుతమైన తారాగణం, ఆసక్తికరమైన కథాంశంతో కూడిన ఈ చిత్రం, ప్రేక్షకులకు గ్రాండ్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వబోతుందన్న విశ్వాసం చిత్రయూనిట్ వ్యక్తం చేసింది.