సినిమా వార్తలు

ప్రభాస్ రాజాసాబ్ ట్రైలర్ అప్డేట్ వచ్చేసింది…

Published by
Rahul N

ప్రభాస్ (Prabhas) అభిమానులు ఎప్పటినుండో వేచి చూస్తున్న తరుణం రానే వచ్చింది. సంక్రాంతి 2026కి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న పాన్-ఇండియా స్టార్ ప్రభాస్ కొత్త సినిమా ద రాజా సాబ్ (The Rajasaab) నుంచి మరో పెద్ద అప్‌డేట్ వచ్చేసింది. ఇంతకాలం ట్రైలర్‌పై కొనసాగిన సస్పెన్స్‌కు చెక్ పెడుతూ ప్రభాస్ స్వయంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రకటించారు. ఈ నెల సెప్టెంబర్ 29న సాయంత్రం 6 గంటలకు ట్రైలర్ విడుదల కానుంది.

ఈ సందర్భంగా అభిమానులకు సర్‌ప్రైజ్‌గా ప్రభాస్ కొత్త పోస్టర్‌ను కూడా షేర్ చేశారు. ఇందులో ఆయనతో పాటు సీనియర్ నటుడు సంజయ్ దత్ (Sanjay Dutt) కనిపించడంతో అంచనాలు మరింత పెరిగాయి. పోస్టర్‌తో పాటు ప్రభాస్, “స్టెప్ ఇన్‌టు ద వరల్డ్ ఆఫ్ #TheRajaSaab… ట్రైలర్ ఆన్ సెప్టెంబర్ 29th” అంటూ క్యాప్షన్ ఇచ్చారు.

మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్, బోమన్ ఇరానీ కీలక పాత్రల్లో నటిస్తుండగా, సంజయ్ దత్ ప్రత్యేకమైన రోల్‌లో కనిపించనున్నారు.

ఇటీవల హీరోయిన్ నిధి అగర్వాల్ కూడా ఎక్స్ (ట్విట్టర్)లో ట్రైలర్ గురించి హింట్ ఇస్తూ – “ఇవాళ చూశాను… మైండ్ బ్లోయింగ్. మీ అందరూ చూడటానికి వెయిట్ చేయలేను” అని ప్రభాస్ అభిమానులను ఊరించిన విషయం తెలిసిందే.

మారుతి దర్శకత్వంలో, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.

ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్‌తో సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటాయి. ఇక ట్రైలర్ (The Rajasaab Trailer) కూడా ప్రేక్షకులను అలరిస్తుందన్న నమ్మకం టీమ్‌లో కనిపిస్తోంది.

Rahul N