పాన్-ఇండియా స్టార్ ప్రభాస్ ఇప్పుడు వరుసగా బిగ్ బజ్ సినిమాలతో ఫ్యాన్స్‌కి ట్రీట్స్ ఇస్తున్నాడు. ఆయన తదుపరి చిత్రం ‘ది రాజా సాబ్’ విడుదల తేదీ ఇంకా వెల్లడించలేదు కానీ, ఈ మూవీ మీదే కాకుండా ప్రభాస్ కెరీర్ మీద కూడా ఎప్పటిలానే భారీ అంచనాలే ఉన్నాయి.
ఇలాంటి టైమ్‌లో ప్రభాస్ ఫ్యాన్స్‌కి ఒక స్పెషల్ సర్ప్రైజ్ వచ్చింది. ఆయన కెరీర్‌ని కొత్త దిశగా తీసుకెళ్లిన సూపర్ హిట్ సినిమా ‘వర్షం’ మళ్లీ థియేటర్లలోకి రాబోతోంది! 2004లో రిలీజైన ఈ రొమాంటిక్ యాక్షన్ డ్రామా మే 23, 2025న గ్రాండ్ రీ-రిలీజ్ అవుతోంది. ఈ సినిమా ఆ రోజుల్లో ప్రభాస్‌కు స్టార్ ఇమేజ్ తెచ్చిపెట్టింది. ఇప్పటికీ చాలా మంది ఫ్యాన్స్‌కి ఇది ఫేవరెట్ మూవీల్లో ఒకటి.
ఈ సినిమాలో త్రిష హీరోయిన్‌గా నటించగా, దివంగత శోభన్ దర్శకత్వం వహించారు. నిర్మాత ఎం.ఎస్. రాజు, సంగీతం ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్… ఈ కాంబినేషన్ అప్పట్లో సూపర్ సక్సెస్ అయింది. అందులోని పాటలు ఇప్పటికీ యూత్ ప్లేలిస్ట్‌లో ఉంటూనే ఉన్నాయి.
ఇప్పుడు ‘వర్షం’ మళ్లీ థియేటర్లకు వస్తుండటంతో, వయసు పైబడ్డ అభిమానులకు నాస్టాల్జిక్ ఫీలింగ్, కొత్త తరం ప్రేక్షకులకు ప్రభాస్ యంగ్ డేస్‌కి సంబంధించిన మాజికల్ మూమెంట్‌లను ఆస్వాదించే అవకాశం దక్కబోతోంది.
ఇదిలా ఉంటే, ప్రభాస్ దగ్గర ఇంకా చాలా సర్ప్రైజ్‌లు ఉన్నాయి. ‘ది రాజా సాబ్’తో పాటు మరోకటి కాదు, పలు ఇంట్రస్టింగ్ ప్రాజెక్ట్స్‌పై కూడా త్వరలో అప్‌డేట్స్ రానున్నాయి.