సినిమా వార్తలు

ప్రదీప్ రంగనాథన్ ‘డ్యూడ్’ ఓటిటీ రిలీజ్ డేట్ ఫిక్స్!

Published by
Srinivas

యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ మళ్లీ తన సక్సెస్ ఫార్ములాను కొనసాగించాడు. ‘లవ్ టుడే’, ‘డ్రాగన్’ సినిమాలతో వరుస హిట్స్ సాధించిన ప్రదీప్ ఇప్పుడు తన తాజా చిత్రం ‘డ్యూడ్’ తో హ్యాట్రిక్ కొట్టాడు. అక్టోబర్ 17న విడుదలైన ఈ సినిమా దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ హిట్టుగా నిలిచింది.

దీపావళి సీజన్‌లో విడుదలైన ‘డ్యూడ్’ సినిమా తక్కువ రోజుల్లోనే ₹100 కోట్ల వసూళ్లు సాధించి వంద కోట్ల క్లబ్‌లో చేరింది. ప్రదీప్ సరసన హీరోయిన్ గా మమిత భైజు నటించింది. తెలుగులో మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని రిలీజ్ చేసింది. కోలీవుడ్‌, టాలీవుడ్‌ రెండింటిలోనూ ఈ చిత్రం కలెక్షన్ల సునామీ సృష్టించింది. యూత్ ఆడియన్స్‌లో ప్రదీప్‌కు ఉన్న క్రేజ్ ఈ సినిమా విజయానికి ప్రధాన కారణమైంది.

ఇప్పటికే థియేటర్‌లలో దాదాపు రెండు వారాల రన్ పూర్తి చేసుకున్న ‘డ్యూడ్’ ఇంకా మరో రెండు వారాల పాటు స్క్రీనింగ్‌ కొనసాగించనుంది. ఆ తర్వాత ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌ నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. సమాచారం ప్రకారం, నవంబర్ 14 నుంచి ‘డ్యూడ్’ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్‌ కానున్నట్లు తెలిసింది.. ఐతే అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమాను భారీ మొత్తానికి కొనుగోలు చేసినట్లు టాలీవుడ్‌ వర్గాల సమాచారం. ఇప్పటికే ప్లాట్‌ఫామ్‌ తమ షెడ్యూల్‌లో ‘డ్యూడ్’ కోసం స్లాట్ సిద్ధం చేసిందని తెలుస్తోంది.

థియేటర్లలో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన ఈ సినిమా నవంబర్ 14న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలవుతుండటంతో అభిమానులు, యూత్ ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

డ్యూడ్ మూవీ రివ్యూ

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.

Recent Posts