సినిమా వార్తలు

‘ఆంధ్ర కింగ్ తాలూకా’… ‘చిన్ని గుండెలో’ సాంగ్ అక్టోబర్ 31న రిలీజ్

Published by
Srinivas

రామ్ పోతినేని ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ నవంబర్ 28న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. భాగ్యశ్రీ బోరిసె హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాకు మహేష్ బాబు పి దర్శకత్వం వహిస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన టీజర్‌ మరియు సాంగ్స్‌కి ట్రెమండస్ రెస్పాన్స్‌ వచ్చింది. ఫస్ట్ సింగిల్ ‘నువ్వుంటే చాలే’ ద్వారా రామ్ తన సింగింగ్ డెబ్యూ చేస్తూ ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. ఈ పాట భారీ సక్సెస్ సాధించి బిగ్గెస్ట్ మ్యూజికల్ హిట్‌గా నిలిచింది. రెండవ సింగిల్ ‘పప్పీ షేమ్’ మాత్రం డిఫరెంట్ వైబ్‌తో యువతను ఆకట్టుకుంది. ఆ పాటకు కూడా రామ్ స్వయంగా వాయిస్ ఇచ్చారు.

ఈ రోజు మేకర్స్ తృతీయ సింగిల్ గురించి అధికారిక అప్‌డేట్ ఇచ్చారు. తాజా సమాచారం ప్రకారం, ‘చిన్ని గుండెలో’ అనే లవ్ సాంగ్‌ను అక్టోబర్ 31న విడుదల చేయనున్నారు. విడుదల చేసిన సాంగ్ అనౌన్స్మెంట్ పోస్టర్‌లో రామ్, భాగ్యశ్రీ జంట క్లాసిక్ లవ్ మూమెంట్‌లో కనిపిస్తూ అభిమానుల హృదయాలను దోచుకుంటున్నారు.

ఈ చిత్రంలో ఉపేంద్ర సూపర్ స్టార్‌గా కీలక పాత్రలో కనిపించనుండగా, రావు రమేష్, మురళీ శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, VTV గణేష్ వంటి ప్రముఖ నటులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

టాప్ టెక్నికల్ టీమ్ ఈ సినిమాకి పని చేస్తోంది. సిద్ధార్థ నుని సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా, శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్‌గా, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు.

ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

అన్ని హంగులు సమకూర్చుకున్న ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ మూవీ నవంబర్ 28న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుండగా, అక్టోబర్ 31న విడుదల కానున్న ‘చిన్ని గుండెలో’ సాంగ్‌ విడుదల కానుంది.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.