
సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్‌గా దూసుకుపోతోన్న నిహారిక కొణిదెల, కమిటీ కుర్రోళ్లు చిత్రంతో జాతీయ స్థాయిలో నిర్మాతగా మంచి గుర్తింపును సంపాదించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆమె జీ స్టూడియోస్ సమర్పణలో, తన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై ఉమేష్ కుమార్ బన్సాల్‌తో కలిసి నిర్మిస్తున్న తాజా చిత్రం రాకాస.
మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్ చిత్రాల్లో అద్భుతమైన నటనతో యువ ప్రేక్షకులను ఆకట్టుకున్న యంగ్ టాలెంటెడ్ హీరో సంగీత్ శోభన్ ఈ చిత్రంతో తొలిసారి సోలో హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రానికి మానస శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ‘రాకాస’ చిత్రాన్ని ఏప్రిల్ 3న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.
ఇప్పటికే విడుదలైన టైటిల్ మోషన్ పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచగా, తాజాగా విడుదలైన గ్లింప్స్ ప్రేక్షకుల్లో మరింత ఉత్సుకతను రేకెత్తిస్తోంది.

“యుగయుగాలుగా ప్రతీ కథలో ఒక సమస్య… ఆ సమస్యను ఛేదించడానికి ఓ వీరుడు పుడతాడు… ఆ వీరుడు ఎవరో అని తెలిసేలోపే నిశ్శబ్దంగా పని ముగిస్తాడు… ఈ కథలో ఆ వీరుడు నేనే” అంటూ భారీ ఎలివేషన్‌తో ప్రారంభమైన గ్లింప్స్, ఒక్కసారిగా కామెడీ మరియు సెటైరికల్ టోన్‌కు షిఫ్ట్ అవుతూ ఆకట్టుకుంటుంది.
ఈ గ్లింప్స్ ద్వారా సంగీత్ శోభన్ తన కామెడీ టైమింగ్‌తో మరోసారి ప్రేక్షకులను మెప్పించబోతున్నాడని స్పష్టమవుతోంది. ట్రెండ్‌కు తగ్గట్టుగా కొత్త కథతో, కొత్త ట్రీట్ ఇవ్వబోతున్న చిత్రంగా ‘రాకాస’ కనిపిస్తోంది. ముఖ్యంగా సంగీత్ శోభన్‌లోని మరో కొత్త కోణాన్ని ఈ సినిమా చూపించనుందని గ్లింప్స్ సూచిస్తోంది. కామెడీనే ప్రధాన బలంగా, దానికి కొత్తదనం జోడించిన కథనం ఈ చిత్రానికి ప్లస్ అవనుందని అంచనా.
ఈ చిత్రానికి సంగీత సారథ్యం వహిస్తున్న అనుదీప్ దేవ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో గ్లింప్స్‌కు అదనపు ఎనర్జీ అందించారు. సినిమాటోగ్రఫీని రాజు ఎదురోలు అందిస్తున్నారు.
