సినిమా వార్తలు

యూ టర్న్ తీసుకున్న రాంచరణ్… మళ్లీ దాని వైపే మొగ్గు..

Published by
Srinivas

18 ఏళ్ళ తన సినీ ప్రస్థానంలో ఎన్నో మైలురాళ్లను దాటిన రాంచరణ్ (Ram Charan) ప్రస్తుతం ఒక విషయంలో యూ టర్న్ తీసుకొన్నట్లు తెలుస్తోంది. అదే గ్లోబల్ స్టార్ (Global Star) టాగ్ విషయంలో…

చిరుతతో సినీ ప్రపంచంలో అరంగేట్రం చేసిన రామ్ చరణ్, మొదటి రెండు సినిమాలకి ఏ టాగ్ లైన్ వాడలేదు. ఆరంజ్ చిత్రం నుండి మెగా పవర్ స్టార్ రాంచరణ్ అంటూ వాడుకలోకి వచ్చింది. అప్పటినుండి ఫాన్స్ కూడా దానికే ఓటు వేశారు. అయితే RRR వరల్డ్ వైడ్ బ్లాక్ బస్టర్ తర్వాత ఫాన్స్ గ్లోబల్ స్టార్ అంటూ ముద్ర వేశారు. అప్పటినుండి గ్లోబల్ స్టార్ అయిన రాంచరణ్ ర్ర్ర్ తదుపరి చిత్రం గేమ్ చేంజర్ కి గ్లోబర్ స్టార్ అనే టాగ్ లైన్ గా చిత్రం టైటిల్స్ లో వాడారు.

అయితే ఆ చిత్రం అంచనాలను అందుకోక అట్టర్ ప్లాప్ గా నిలిచింది. దాని పర్యవసానమో లేక సెంటిమెంటును దెబ్బ తీసిందనో తెలియదు కానీ, మళ్ళీ మెగా పవర్ స్టార్ (Mega Power Star) కే జై కొట్టారు మన గ్లోబల్ స్టార్. నిన్న రిలీజ్ ఐన ‘పెద్ది'(Peddi) కొత్త పోస్టర్ లో ‘గ్లోబల్ స్టార్’ టైటిల్‌ను తొలగించి, మళ్లీ ఆయన అసలైన ఇమేజ్‌కు న్యాయం చేసే “మెగా పవర్ స్టార్” ట్యాగ్‌ను జోడించారు.

అభిమానుల్లో ఇప్పటికే ఆ పోస్టర్ హ్యూజ్ బజ్ సృష్టించింది.

గ్రామీణ నేపథ్యంతో రగ్డ్ మూడ్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి విడుదలైన పోస్టర్ సరిగ్గా ఆ వైబ్‌ను మిర్రర్ చేస్తోంది. రైల్వే ట్రాక్ మీద భుజాన బ్యాగ్ వేసుకుని, చేతిలో బీడీ పట్టుకుని, దట్టమైన గడ్డంతో, ఇంటెన్స్ లుక్‌లో కనిపించిన చరణ్ మాస్ అటిట్యూడ్‌ను మరింత పెంచేశారు.

ఈ సినిమాలో రామ్ చరణ్ పలు గెటప్స్‌లో కనిపించనున్నారు. ప్రతీ లుక్ వెనుక ఉన్న ఎమోషనల్ షేడ్స్, ఆయన శరీరభాషలో వచ్చిన మార్పులు, కఠినమైన శిక్షణ – అన్నీ ఆయన డెడికేషన్‌కు నిదర్శనమని చెప్పొచ్చు.

ఉప్పెన చిత్రంతో సంచలనం సృష్టించిన దర్శకుడు బుచ్చి బాబు సన (Buchi Babu Sana) తెరకెక్కిస్తున్న ఈ పెద్ది చిత్రాన్ని రామ్ చరణ్ కెరీర్‌లో అత్యంత భావోద్వేగభరితంగా, ఆత్మీయంగా ఉండే ప్రాజెక్ట్‌గా మేకర్స్ ప్రమోట్ చేస్తున్నారు.

అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు పొందిన మ్యూజిక్ మాస్ట్రో ఏఆర్ రెహ్మాన్ (AR Rahman) ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండటం మరో హైలైట్. మొదటి సింగిల్ త్వరలోనే విడుదల కానుంది. విరిద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని, మైత్రీ మూవీ మేకర్స్ మరియు సుకుమార్ రైటింగ్స్ ప్రతిష్ఠాత్మకంగా ప్రజెంట్ చేస్తున్నారు.

హీరోయిన్గా జాన్వీ కపూర్ (Janhvi Kapoor) నటిస్తుండగా, శివరాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. టెక్నికల్ టీమ్ కూడా అగ్రశ్రేణి – సినిమాటోగ్రఫీకి ఆర్. రత్నవేలు, ఎడిటింగ్‌కి జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి బాధ్యతలు చేపట్టారు.

రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భానికే, 2026 మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా పెడ్డి చిత్రం గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కానుంది.

ఇప్పటివరకు రాంచరణ్ ఏయే చిత్రాలకు ఏ టాగ్ లైన్ వాడారంటే…

MovieTagline
చిరుతIntroducing Ram Charan
మగధీరRam Charan (No Tagline)
ఆరంజ్ Mega Power Star Ram Charan
రచ్చMega Power Star Ram Charan
నాయక్ Mega Power Star Ram Charan
జంజీర్ Mega Power Star Ram Charan
ఎవడుMega Power Star Ram Charan
గోవిందుడు అందరి వాడేలే Mega Power Star Ram Charan
బ్రూస్లీ Mega Power Star Ram Charan
ధ్రువ Mega Power Star Ram Charan
రంగస్థలంMega Power Star Ram Charan
వినయ విధేయ రామMega Power Star Ram Charan
RRRRam Charan (No Tagline)
ఆచార్యMega Power Star Ram Charan
గేమ్ ఛేంజర్ Global Star Ram Charan
Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.