Download App

RGV: మళ్లీ ముంబై పోతున్న రామ్ గోపాల్ వర్మ…

అక్టోబర్ 23, 2025 By Rahul N
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (RGV) మళ్లీ ముంబైకి షిఫ్ట్ అవుతున్నట్లు తెలిసింది. గత కొన్ని సంవత్సరాల క్రితం ముంబై నుండి హైదరాబాద్ వచ్చారు. ఇక్కడే స్థిరపడి, తెలుగు సినిమాలపై దృష్టి పెట్టిన వర్మ, ఇప్పుడు తిరిగి బాలీవుడ్‌కు మకాం మారుస్తున్నారు. వర్మ ఇప్పటికే కొన్ని హిందీ ప్రాజెక్టులకు...

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (RGV) మళ్లీ ముంబైకి షిఫ్ట్ అవుతున్నట్లు తెలిసింది. గత కొన్ని సంవత్సరాల క్రితం ముంబై నుండి హైదరాబాద్ వచ్చారు. ఇక్కడే స్థిరపడి, తెలుగు సినిమాలపై దృష్టి పెట్టిన వర్మ, ఇప్పుడు తిరిగి బాలీవుడ్‌కు మకాం మారుస్తున్నారు.

వర్మ ఇప్పటికే కొన్ని హిందీ ప్రాజెక్టులకు సైన్ చేసినట్లు సమాచారం. వీటిలో ముఖ్యంగా అమితాబ్ బచ్చన్ హీరోగా తెరకెక్కనున్న ‘సర్కార్’ ఫ్రాంచైజ్ నాలుగో భాగం కూడా ఉండబోతుందని తెలిసింది. ఈ ఫ్రాంచైజ్‌లోని మొదటి మూడు సినిమాలు – Sarkar (2005), Sarkar Raj (2008), Sarkar 3 (2017) – ప్రేక్షకుల మరియు విమర్శకుల ప్రశంసలను అందుకున్నాయి.

ఇటీవల బాలీవుడ్ యాంకర్ సిద్ధార్థ్ కన్నన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వర్మ మాట్లాడుతూ – “నేను మళ్లీ ముంబైకి వెళ్తున్నాను. త్వరలో హిందీ సినిమాల షూటింగ్‌ను ప్రారంభిస్తాను,” అని తెలిపారు.

ఇక మరోవైపు, ఆయన కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన ఐకానిక్ డెబ్యూ ఫిల్మ్ ‘శివ’ మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రాన్ని అత్యాధునిక 4K రీస్టోరేషన్‌లో నవంబర్ 14న మళ్లీ విడుదల చేయడానికి సన్నాహాలు చేసున్నారు. నాగార్జున హీరోగా, 1989లో విడుదలైన ఈ సినిమా తెలుగు సినిమా చరిత్రలో ఒక గేమ్‌చేంజర్‌గా నిలిచింది. వర్మ డైరెక్షన్, ఇళయరాజా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, నాగార్జున ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్… ఇవన్నీ ‘శివ’ని ఒక కల్ట్ క్లాసిక్‌గా నిలిపాయి.

‘శివ’ రీ-రిలీజ్ తర్వాత వర్మ తన కొత్త హిందీ సినిమాలపై పూర్తి స్థాయిలో పని ప్రారంభించనున్నారు. హిందీ సినీ పరిశ్రమలో మరోసారి తన ప్రత్యేక శైలి, దృష్టితో రామ్ గోపాల్ వర్మ కొత్త అధ్యాయం ఆరంభించబోతున్నారు.

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading