Download App

‘ఓఎం – చాప్టర్ 1: ఉదిరం’లో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా సాయిపల్లవి..

అక్టోబర్ 27, 2026 • By Srinivas
ధనుష్ హీరోగా, రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఓఎం – చాప్టర్ 1: ఉదిరం – ది బ్లడ్ వుడ్’ నుంచి మరో ఆసక్తికరమైన అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న సాయిపల్లవి క్యారెక్టర్ ఇంట్రడక్షన్ వీడియోను మేకర్స్...
‘ఓఎం – చాప్టర్ 1: ఉదిరం’లో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా సాయిపల్లవి..

ధనుష్ హీరోగా, రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఓఎం – చాప్టర్ 1: ఉదిరం – ది బ్లడ్ వుడ్’ నుంచి మరో ఆసక్తికరమైన అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న సాయిపల్లవి క్యారెక్టర్ ఇంట్రడక్షన్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు. ఇందులో ఆమె నిత్యారెడ్డి అనే పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. ఇప్పటివరకు చేయని భిన్నమైన పాత్రలో సాయిపల్లవి కనిపించడంతో అభిమానుల్లో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది.

సరికొత్త అవతార్‌లో సాయిపల్లవి

నిత్యారెడ్డి ఓ తెలివైన, నిజాయతీగల, అనుభవజ్ఞురాలైన యువ పోలీస్ అధికారి. గతంలో సీబీఐ, ఇంటర్‌పోల్ విభాగాల్లో పనిచేసిన ఆమె.. ఎర్రచందనం స్మగ్లింగ్‌ను అడ్డుకునేందుకు చేపట్టిన ‘ఆపరేషన్ ఓఎం’కు నాయకత్వం వహిస్తుంది. తాజాగా విడుదలైన క్యారెక్టర్ ఇంట్రడక్షన్ వీడియోలో సాయిపల్లవి అధికారిక హుందాతనం, ఆత్మవిశ్వాసం, దృఢమైన వ్యక్తిత్వం ఆకట్టుకుంటున్నాయి.

సహజమైన నటన, భావోద్వేగాలను అద్భుతంగా పలికించడంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సాయిపల్లవి.. ఈసారి పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కొత్త సవాల్‌ను స్వీకరించారు. ఆమె బాడీ లాంగ్వేజ్, పాత్రలోని తీవ్రత, విభిన్న కోణాలు వీడియోలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. నిత్యారెడ్డి పాత్రలో ఆమె కనిపిస్తున్న తీరు సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది.

‘ఓఎం – చాప్టర్ 1: ఉదిరం’లో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా సాయిపల్లవి..

ధనుష్, మమ్ముట్టి పాత్రల తర్వాత సాయిపల్లవి పరిచయం

ఇప్పటికే ఈ సినిమా నుంచి ధనుష్ పాత్రను పరిచయం చేస్తూ విడుదల చేసిన ‘ఓఎం ఫస్ట్ స్ట్రైక్’ వీడియోకు మంచి స్పందన వచ్చింది. అలాగే మమ్ముట్టి ‘బర్మా కార్తికేయన్’గా కనిపించిన క్యారెక్టర్ ఇంట్రడక్షన్ కూడా అభిమానులను ఆకట్టుకుంది. ఇప్పుడు సాయిపల్లవి పాత్ర పరిచయ వీడియో విడుదల కావడంతో సినిమాపై చర్చ మరింత పెరిగింది.

ఈ చిత్రంలోని పాటలు కూడా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా తాజాగా విడుదలైన రెండో పాట ‘వీజా వీరా’ తమిళం, తెలుగు, హిందీ భాషల్లో విడుదలైంది. సాయి అభ్యంకర్ స్వరపరిచి, ఆలపించిన ఈ పాటలో టిప్పు కూడా గాత్రం అందించారు. పాటలకు వస్తున్న స్పందన సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.

భారీ తారాగణంతో పాన్ ఇండియా చిత్రం

ఆర్‌టేక్ స్టూడియోస్ బ్యానర్‌పై శ్రద్ధా అగర్వాల్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ధనుష్‌కు చెందిన వండర్‌బార్ ఫిల్మ్స్‌తో కలిసి రూపొందిస్తున్నారు. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ధనుష్, మమ్ముట్టి, సాయిపల్లవి, శ్రీలీల, నసీరుద్దీన్ షా వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

ఈ చిత్రానికి సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నారు. కె. ఎళిల్ అరసు సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తిస్తుండగా, ఆర్. కళైవాణన్ ఎడిటింగ్ చేస్తున్నారు. ఏ. పన్నీర్‌సెల్వం ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. యానిక్ బెన్, కేచా ఖమ్‌ఫక్డీ యాక్షన్ సన్నివేశాలకు కొరియోగ్రఫీ అందిస్తున్నారు.

భారీ తారాగణం, ఆసక్తికరమైన పాత్రలు, యాక్షన్ నేపథ్యం, ఆకట్టుకుంటున్న సంగీతంతో ‘ఓఎం – చాప్టర్ 1: ఉదిరం – ది బ్లడ్ వుడ్’పై అంచనాలు పెరుగుతున్నాయి. ఈ చిత్రం 2026 నవంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.

View all posts