సినిమా వార్తలు

సెన్సార్ పూర్తి చేసుకున్న సమంత ‘మా ఇంటి బంగారం’..

Published by
Srinivas

స్టార్ హీరోయిన్ Samantha Ruth Prabhu ప్రధాన పాత్రలో నటిస్తూ, సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న “మా ఇంటి బంగారం” సినిమా విడుదలకు సిద్ధమైంది. ట్రాలాలా పిక్చర్స్ బ్యానర్‌పై సమంత, Raj Nidimoru, హిమాంక్ దువ్వూరు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి Nandini Reddy దర్శకత్వం వహించారు.

ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేకెత్తించగా, తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. చిత్రాన్ని వీక్షించిన సెన్సార్ బోర్డు సభ్యులు మూవీపై ప్రశంసలు కురిపించినట్లు సమాచారం. చిత్రానికి యూ/ఏ (U/A) సర్టిఫికెట్ లభించగా, జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.

ఇటీవల సమంత సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటిస్తూ సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ప్రేక్షకులు ఖర్చు చేసే సమయం, డబ్బుకు పూర్తి స్థాయిలో న్యాయం చేసే చిత్రంగా “మా ఇంటి బంగారం” నిలుస్తుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.

ఈ చిత్రానికి Santhosh Narayanan సంగీతం అందించగా, ఓం ప్రకాష్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహించారు. ఎడిటింగ్‌ను ధర్మేంద్ర కాకర్ల చేశారు.

ఇక నటీనటుల విషయానికి వస్తే, శ్రీనివాస గవిరెడ్డి, మంజూష, Diganth, Gulshan Devaiah, Sreemukhi, Gautami, ఆనంద్, లక్ష్మి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

కుటుంబ ప్రేక్షకులతో పాటు అన్ని వర్గాల ఆడియన్స్‌ను ఆకట్టుకునేలా రూపొందిన “మా ఇంటి బంగారం” జూన్ 19న బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.