యుద్ధం, జూదం – రెండింటినీ సమానంగా ఆడే ఓ మాస్టర్ మైండ్ కథ ఇది! తాజాగా విడుదలైన ‘గ్యాంబ్లర్స్’ టీజర్ ప్రారంభం ఆకట్టుకునే పవర్‌ఫుల్ డైలాగ్‌తో మొదలవుతుంది – “యుద్ధం జూదం ఒక్కటే… యుద్ధం ఎక్కడ మొదలుపెట్టాలో తెలిసుండాలి, జూదం ఎక్కడ ఆపాలో తెలిసుండాలి.”
టీజర్ మొత్తం చూస్తే మిస్టరీ, మాస్ట్ మైండ్ మూవ్‌మెంట్స్, యాక్షన్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో నిండిన కథగా కనిపిస్తోంది. సంగీత్ శోభన్ ఈసారి ఒక స్టైలిష్ గ్యాంబ్లర్‌గా కనిపించబోతున్నాడు. అతడి పాత్రలోని చైతన్యాన్ని, ఎమోషన్స్‌ను టీజర్ స్పష్టంగా చూపిస్తోంది. ప్రతి కట్, డైలాగ్, విజువల్ – కథలో ఉన్న ఉత్కంఠను పెంచేలా ఉన్నాయి.
‘గ్యాంబ్లర్స్’ చిత్రంలో ప్రశాంతి చారులింగా కథానాయికగా నటిస్తుండగా, రాకింగ్ రాకేష్ (కేసీఆర్ ఫేమ్), పృథ్వీరాజ్ బన్న, సాయి శ్వేత, జస్విక, భరణి శంకర్, మల్హోత్ర శివ, శివారెడ్డి కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
ఈ సినిమాకు కేఎస్‌కే చైతన్య దర్శకత్వం వహిస్తుండగా, సునీత మరియు రాజ్‌కుమార్ బృందావనం నిర్మాణ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రేష్మాస్ స్టూడియోస్ మరియు స్నాప్ అండ్ క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు నిర్మిస్తున్నాయి.
జూన్ 6న ‘గ్యాంబ్లర్స్’ థియేటర్లలోకి రానుంది.