తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న గద్దర్ ఫిలిం అవార్డుల్లో ఈసారి ప్రత్యేక కేటగిరీల్ని కూడా ప్రవేశపెట్టారు. స్పెషల్ జ్యూరీ అవార్డులు, వ్యక్తిగత జ్యూరీ అవార్డులతో పాటు, కొంతమంది ప్రముఖుల పేరిట ప్రత్యేక అవార్డుల్ని ప్రవేశపెట్టారు. తొలిసారి ఆ అవార్డుల్ని అందుకున్న ప్రముఖులు ఎవరో ఇప్పుడు చూద్దాం.
గద్దర్ ఫిలిం అవార్డుల ప్రత్యేక కేటగిరీలో ఎన్టీఆర్ నేషనల్ ఫిలిం అవార్డ్ ఒకటి. ఈ అవార్డుకు నందమూరి బాలకృష్ణను ఎంపిక చేశారు. తనకు దక్కిన గౌరవంపై ఆనందం వ్యక్తం చేశారు బాలయ్య.
ఇక పైడి జైరాజ్ ఫిల్మ్ అవార్డున దర్శకుడు మణిరత్నంకు ప్రకటించారు. బీఎన్ రెడ్డి ఫిలిం అవార్డును సుకుమార్ కు, నాగిరెడ్డి-చక్రపాణి ఫిలిం అవార్డును అట్లూరి పూర్ణచంద్రరావుకు ప్రకటించారు.
తెలంగాణకు చెందిన నటుడు కాంతారావు పేరిట కూడా ప్రత్యేక ఫిలిం అవార్డు విభాగాన్ని ఏర్పాటుచేశారు. ఈ అవార్డు కింద హీరో విజయ్ దేవరకొండను ఎంపిక చేశారు. తనకు దక్కిన గౌరవానికి విజయ్ దేవరకొండ ఆనందం వ్యక్తం చేశాడు. అవార్డును ఫ్యాన్స్ కు అంకితం చేశాడు. ఇక రఘుపతి వెంకయ్య ఫిలిం అవార్డును యండమూరి వీరేంద్రనాధ్ కు అందించబోతున్నారు.