సినిమా వార్తలు

‘రుద్రమదేవి’కి గద్దర్ అవార్డు దక్కడం ఎంతో ఆనందంగా ఉంది – గుణ శేఖర్

Published by
Srinivas

తెలంగాణ ప్రభుత్వం గద్దర్ సినీ అవార్డులను ప్రకటించిన నేపథ్యంలో, 2015లో విడుదలైన చిత్రాల నుంచి ‘రుద్రమదేవి’, ‘కంచె’, ‘శ్రీమంతుడు’ చిత్రాలకు ఉత్తమ చిత్ర అవార్డులు ప్రకటించాయి. ఈ సందర్భంగా ‘రుద్రమదేవి’ చిత్ర దర్శకుడు మరియు నిర్మాత గుణ శేఖర్ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా గుణ శేఖర్ మాట్లాడుతూ … “2015 సంవత్సరానికి గాను గుణ టీమ్ వర్క్స్ బ్యానర్‌పై రాగిణి గుణ, నీలిమ గుణ, యుక్త గుణ సంయుక్తంగా నిర్మించిన ‘రుద్రమదేవి’ చిత్రానికి ఉత్తమ చిత్రంగా గద్దర్ అవార్డు దక్కడం ఎంతో ఆనందదాయకం. ఇది మాకు గొప్ప గౌరవం, విశేషమైన ప్రోత్సాహం. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, జ్యూరీ చైర్మన్ మురళీ మోహన్ గారికి, ఇతర సభ్యులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.”

“రుద్రమదేవిగా అనుష్క అద్భుతంగా నటించారు. ఆమె ఈ విజయంలో ప్రధాన కారణం. గోన గన్నారెడ్డి పాత్రలో అల్లు అర్జున్ తెరపై మాత్రమే కాకుండా, తెరవెనుక కూడా మా చిత్రానికి విశేషంగా మద్దతుగా నిలిచారు. వారిద్దరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు. మా చిత్రానికి కృషిచేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ఈ ఏడాది గద్దర్ అవార్డు పొందిన అందరికీ నా హృదయపూర్వక అభినందనలు.” అని తెలిపారు.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.

Recent Posts