Download App

గద్దర్ ఫిలిం అవార్డుల్లో ప్రత్యేక కేటగిరీలు

మే 31, 2025 By Rahul N
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న గద్దర్ ఫిలిం అవార్డుల్లో ఈసారి ప్రత్యేక కేటగిరీల్ని కూడా ప్రవేశపెట్టారు. స్పెషల్ జ్యూరీ అవార్డులు, వ్యక్తిగత జ్యూరీ అవార్డులతో పాటు, కొంతమంది ప్రముఖుల పేరిట ప్రత్యేక అవార్డుల్ని ప్రవేశపెట్టారు. తొలిసారి ఆ అవార్డుల్ని అందుకున్న ప్రముఖులు ఎవరో ఇప్పుడు చూద్దాం. గద్దర్ ఫిలిం...
గద్దర్ ఫిలిం అవార్డుల్లో ప్రత్యేక కేటగిరీలు

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న గద్దర్ ఫిలిం అవార్డుల్లో ఈసారి ప్రత్యేక కేటగిరీల్ని కూడా ప్రవేశపెట్టారు. స్పెషల్ జ్యూరీ అవార్డులు, వ్యక్తిగత జ్యూరీ అవార్డులతో పాటు, కొంతమంది ప్రముఖుల పేరిట ప్రత్యేక అవార్డుల్ని ప్రవేశపెట్టారు. తొలిసారి ఆ అవార్డుల్ని అందుకున్న ప్రముఖులు ఎవరో ఇప్పుడు చూద్దాం.

గద్దర్ ఫిలిం అవార్డుల ప్రత్యేక కేటగిరీలో ఎన్టీఆర్ నేషనల్ ఫిలిం అవార్డ్ ఒకటి. ఈ అవార్డుకు నందమూరి బాలకృష్ణను ఎంపిక చేశారు. తనకు దక్కిన గౌరవంపై ఆనందం వ్యక్తం చేశారు బాలయ్య.

ఇక పైడి జైరాజ్ ఫిల్మ్ అవార్డున దర్శకుడు మణిరత్నంకు ప్రకటించారు. బీఎన్ రెడ్డి ఫిలిం అవార్డును సుకుమార్ కు, నాగిరెడ్డి-చక్రపాణి ఫిలిం అవార్డును అట్లూరి పూర్ణచంద్రరావుకు ప్రకటించారు.

తెలంగాణకు చెందిన నటుడు కాంతారావు పేరిట కూడా ప్రత్యేక ఫిలిం అవార్డు విభాగాన్ని ఏర్పాటుచేశారు. ఈ అవార్డు కింద హీరో విజయ్ దేవరకొండను ఎంపిక చేశారు. తనకు దక్కిన గౌరవానికి విజయ్ దేవరకొండ ఆనందం వ్యక్తం చేశాడు. అవార్డును ఫ్యాన్స్ కు అంకితం చేశాడు. ఇక రఘుపతి వెంకయ్య ఫిలిం అవార్డును యండమూరి వీరేంద్రనాధ్ కు అందించబోతున్నారు.

Trending Now

No trending articles in this category from the last 3 days.

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading