Download App

తెలుగులో ‘వీరభద్రుడు’గా సూర్య ‘కరుప్పు’

ఏప్రిల్ 4, 2026 By Srinivas
తమిళ స్టార్ హీరో Suriya తన భారీ మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ ‘కరుప్పు’ కోసం దర్శకుడు RJ Balajiతో చేతులు కలిపారు. ఈ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్‌ను ప్రముఖ నిర్మాణ సంస్థ Dream Warrior Pictures భారీ స్థాయిలో నిర్మిస్తోంది. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో కంటెంట్ ఆధారిత...
తెలుగులో ‘వీరభద్రుడు’గా సూర్య ‘కరుప్పు’

తమిళ స్టార్ హీరో Suriya తన భారీ మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ ‘కరుప్పు’ కోసం దర్శకుడు RJ Balajiతో చేతులు కలిపారు. ఈ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్‌ను ప్రముఖ నిర్మాణ సంస్థ Dream Warrior Pictures భారీ స్థాయిలో నిర్మిస్తోంది.

తమిళం, తెలుగు, హిందీ భాషల్లో కంటెంట్ ఆధారిత విజయవంతమైన చిత్రాలను అందించిన డ్రీమ్ వారియర్ పిక్చర్స్, ఈ చిత్రాన్ని స్కేల్ మరియు కంటెంట్ పరంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై భారీ అంచనాలను పెంచింది.

తాజాగా ఈ చిత్రానికి తెలుగులో ‘వీరభద్రుడు’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ప్రకటించారు. సూర్య మాస్ అవతార్‌లో కనిపించిన టైటిల్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

ఈ చిత్రంలో Trisha Krishnan హీరోయిన్‌గా నటిస్తుండగా, Indrans, Natarajan Subramaniam (నట్టి), Swasika, Anagha Maya Ravi కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

సంగీతాన్ని Sai Abhyankkar అందిస్తుండగా, సినిమాటోగ్రఫీని G K Vishnu నిర్వహిస్తున్నారు.

భారీ అంచనాల మధ్య ఈ చిత్రం 2026 మే 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.

View all posts

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading