సినిమా వార్తలు

నటశూన్యులతో నిండిపోతున్న తెలుగు సినిమా… ప్రేక్షకులను కాపాడేదెవరు..?

Published by
Suresh Thota

నటశూన్యులతో కునారిల్లుతున్న తెలుగు చిత్ర పరిశ్రమ… అవును నిజమే తెలుగు ఇండస్ట్రీలో యువ హీరోలుగా వస్తున్న… చాలామంది నటశూన్యులే… ముఖంలో ఏ భావములు పలకవు…. అయినా వాళ్ళు హీరోలే…. తెలుగు చదవడం రాదు… అయినా హీరోలే…. ఉచ్చారణ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. కులం అనే గొడుగుతో సగం మంది ఇండస్ట్రీలో కొట్టుకు వస్తుంటే… కొంతమంది పెట్టుబడి పెట్టీ, లేకపోతే ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తో హీరోలుగా చలామణి అయిపోతున్నారు.

శరీరంలో రిథమ్ లేకుండా డాన్స్ చేసేవారు కొందరైతే… కొందరు తెర మీద నటించెప్పుడు ఏడిస్తే… మనకు గొప్ప నవ్వు వస్తుంది…. అటువంటి నటులు తెలుగు సినిమాలో ఏదోవిధంగా ఒక రెండు సినిమాల్లో నటిస్తే మనం సుప్రసిద్ధులమై పోతాం… అని ఒక పెట్టుబడిదారుడిగా ఆలోచించే వాళ్లకొందరు. ఒక పాత్రలో ప్రేక్షకుడిని లీనం చేయాల్సిన నటుడు…. మన సహనానికి పరీక్ష పెట్టేలా తయారు అవుతున్నారు.

నవ రసాలను పలికించే నిష్ణాతులైన నటులు తెలుగు చిత్ర పరిశ్రమకు సొంతం. ఒక SV రంగారావు, NT రామారావు, A. నాగేశ్వరరావు ఇలా చెప్పుకుంటూ పోతే పాత్రకు ప్రాణం పోసేవారు. అలాగే తెలుగులో డాన్స్ లకు పేరు గాంచిన హీరో గా మొదట ANR ను పేర్కొంటే…. తరువాత తెలుగు సినిమా డాన్స్ ను ఎవరెస్ట్ శిఖరం అంత ఎత్తుకు తీసుకువెళ్లిన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి.

ఢిల్లీలో చిరంజీవి హిందీ మూవీ “ఆజ్ కా గుండారాజ్” రిలీజ్ అయితే ఆ సినిమా చూసిన ఒక నార్త్ ఇండియా MP , పార్లమెంట్ క్యాంటీన్లో మన MPని ఉద్దేశించి “కల్ రాత్ మే ఏక్ సౌత్ వాలా మూవీ దేఖా…. డాన్స్ బహుత్ అచ్ఛా హై” అని మాట్లాడుతుంటే, ఆ మాటలు విన్న తెలుగు ఎంపీలు పొంగిపోయారు. అది చిరంజీవి డాన్స్ కి ఉన్న క్రేజ్.

ఇప్పుడు అంత కసి ఉన్న హీరోలు లేకపోయే… తన పాత్రకి ఎంతవరకు న్యాయం చేశాము అనే విషయం మరచిపోయి… ఆ హీరోయిన్ కావాలి, ఈ కొరియో గ్రాఫర్ కావాలి, ఆ ఫైట్ మాస్టర్ కావాలి…. CG వర్క్ కి….. ఇంత బడ్జెట్ కావాలి ఇదే ఆలోచన తప్పితే…. తన నటన ఎంత అనే ఆలోచన నేటి యువ హీరోలలో కొరవడింది. తన “బాడీ సైజు ఏమిటి” అనే ఆలోచన లేకుండా తను గుద్దితే నాలుగు అంబాసిడర్ లు అటు వైపు కు జరగాల్సిందే అని పట్టుబట్టి సినిమా బడ్జెట్ పెంచి , ప్లాప్ కి ఇతోధికంగా పాటుపడే హీరోలను ఏమనాలి.

“చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునే విధంగా” నేటి యువ కథానాయకులు తయారు అయ్యారు. పెద్ద హీరోల పేరు చెప్పుకుని తమ్ముడ్ని, బావమరిదిని, మేనల్లుడని, అన్న కొడుకుని, అల్లుడిని… ఇలా ఒకటేమిటి రకరకాల బంధుత్వాలతో హీరోగా తెలుగు తెరని చించేద్దామని వస్తున్నారు కాని, నటన మీద దృష్టి పెట్టడం లేదు.

NTR వారసత్వం పుణికి పుచ్చుకున్న బాలకృష్ణ ఎంత కష్టపడ్డాడో తెలుసా, చిరంజీవి వారసత్వం అందుకున్న పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ లో ఎంత కష్టపడ్డారో అది చూడరు… సరిగ్గా తెలుగులో ఒక పేజీ డైలాగ్స్ చదవలేరు. కాని తెలుగు సినిమా ఇండస్ట్రీని ఏలాలి…. వాళ్ళకి వచ్చిందే నటన… దానిని మెరుగు పరచుకోవడానికి కృషి చేయరు. దర్శకులు కూడా మెరుగు పరచడానికి కృషి చేయరు… వీళ్ళకి కూడా అంతకు మించి వాళ్ళ నుండి నటన రాబట్టే అంత దర్శకత్వ నైపుణ్యం ఉండటం లేదేమో… నాలుగు డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో, ఆరు పాటలలో ఏదో ఒక పాటతో గట్టెక్కేస్తే చాలు అనే తత్వం పోతే గాని తెలుగు సినిమా బాగుపడదేమో… కథకు తగ్గట్టుగా నటించే హీరోలు ఉన్నప్పుడే తెలుగు సినిమా పరిఢవిల్లుతుంది.

ఇలా నట శూన్యులతో నిండిపోతున్న తెలుగు సినిమా ప్రేక్షకులను కాపాడేదెవరు…

Suresh Thota

Recent Posts