సినిమా వార్తలు

తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 4లో సందడి చేసిన జెనీలియా

Published by
Rahul N

తెలుగులో అత్యంత పాపులర్ సింగింగ్ రియాలిటీ షోగా నిలుస్తున్న ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 4 ప్రతి వారం కొత్త ప్రతిభావంతుల గాత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తూ హంగామా సృష్టిస్తోంది. ఈ షో ఇప్పటివరకూ అనేకమంది సింగర్స్‌కు వేదికగా నిలిచింది. తాజాగా ప్రసారమైన ఎపిసోడ్‌లో ప్రత్యేక అతిథిగా నటి జెనీలియా పాల్గొనడం షోకే హైలైట్‌గా మారింది.

తెలుగు ప్రేక్షకులకు హాసినీగా బాగా తెలిసిన జెనీలియా, చాలా కాలం తర్వాత ఒక తెలుగు కార్యక్రమంలో కనిపించడం అభిమానులకు సూపర్ సర్‌ప్రైజ్‌గా నిలిచింది. కాంటెస్టెంట్స్‌తో కబుర్లు చెప్పడం, వారిని ఉత్సాహపరచడం, తన సినీ అనుభవాలను పంచుకోవడం ద్వారా ఆమె స్టేజ్ మొత్తాన్ని కాంతివంతం చేశారు. షో జడ్జెస్, హోస్టులు కూడా జెనీలియాతో కలిసి క్షణాలను ఎంజాయ్ చేయడం ఎపిసోడ్‌కి మరింత కలర్ జోడించింది.

ఈ సీజన్‌కి ప్రముఖ సంగీత దర్శకుడు తమన్, గాయకులు కార్తీక్ మరియు గీతా మాధురి జడ్జెస్‌గా వ్యవహరిస్తున్నారు. వీరి కామెంట్స్, ప్రోత్సాహకరమైన సూచనలు కాంటెస్టెంట్స్‌కి మానసిక బలాన్ని ఇస్తున్నాయి.

హోస్ట్‌గా శ్రీరామచంద్ర, కో-హోస్ట్‌గా సమీరా భరద్వాజ్ తమదైన స్టైల్‌లో ప్రేక్షకులను అలరిస్తున్నారు. వారి హాస్యం, ఎంటర్‌టైన్‌మెంట్ కూడా ఈ కార్యక్రమానికి అదనపు ఆకర్షణగా నిలుస్తోంది.

ప్రతి శుక్రవారం, శనివారం సాయంత్రం 7 గంటలకు ఆహా ఓటీటీలో ప్రసారమవుతున్న తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 4, కుటుంబ సభ్యులు అంతా కూర్చొని చూసే వినోదాత్మక కార్యక్రమంగా మారింది. పాటల పట్ల ఆసక్తి ఉన్నవారికి ఇది ఒక గొప్ప వేదికగా నిలుస్తోంది.

కొత్త ప్రతిభను వెలికితీయడంలో, సింగర్స్‌కి పెద్ద వేదిక కల్పించడంలో ఆహా ముందంజలో ఉందని ప్రేక్షకులు, సంగీతాభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రతి ఎపిసోడ్ ఒక మ్యూజిక్ ఫెస్టివల్‌లా అనిపిస్తోందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Rahul N

Recent Posts