Download App

‘ఉస్తాద్ భగత్ సింగ్’ అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం…

మార్చి 14, 2026 By Srinivas
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తదుపరి థియేట్రికల్ రిలీజ్‌గా రాబోతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ “ఉస్తాద్ భగత్ సింగ్” పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా “గబ్బర్ సింగ్” వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత పవన్ కళ్యాణ్ – దర్శకుడు హరీష్ శంకర్ కలయికలో వస్తున్న సినిమా కావడంతో...
‘ఉస్తాద్ భగత్ సింగ్’ అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తదుపరి థియేట్రికల్ రిలీజ్‌గా రాబోతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ “ఉస్తాద్ భగత్ సింగ్” పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా “గబ్బర్ సింగ్” వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత పవన్ కళ్యాణ్ – దర్శకుడు హరీష్ శంకర్ కలయికలో వస్తున్న సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్‌కు ప్రత్యేకమైన క్రేజ్ ఏర్పడింది.

తాజా సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఇప్పటికే కొన్ని థియేటర్లలో టికెట్ బుకింగ్స్ ఓపెన్ చేయగా, బెనిఫిట్ షోల బుకింగ్స్ కూడా ప్రారంభమవుతున్నాయి. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మిగతా థియేటర్లలో కూడా అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి.

ఇక అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ట్రైలర్ ఈరోజు సాయంత్రం విడుదల కానుంది. ట్రైలర్ విడుదలతో సినిమాపై హైప్ మరింత పెరిగే అవకాశముంది.

‘ఉస్తాద్ భగత్ సింగ్’కు భారీ ఓటీటీ డీల్.. నెట్‌ఫ్లిక్స్ చేతికి పవన్ కల్యాణ్ మూవీ స్ట్రీమింగ్ రైట్స్

ఈ సినిమాలో శ్రీలీల మరియు రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. నవీన్ ఎర్నేని, యలమంచిలి రవి శంకర్లు ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

“సంతోషం” దర్శకుడు దాసరథ్ ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే అందించారు. సంగీత విభాగంలో దేవి శ్రీ ప్రసాద్ పాటలను స్వరపరచగా, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ను ఎస్. థమన్ అందిస్తున్నారు.

అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం కావడంతో పాటు ట్రైలర్ విడుదల కూడా ఉండటంతో “ఉస్తాద్ భగత్ సింగ్”పై అభిమానుల్లో ఉత్సాహం మరింత పెరుగుతోంది.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.

View all posts

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading