Download App

‘మన శంకర వర ప్రసాద్ గారు’ సెట్లోకి వచ్చేసిన వెంకీమామ!

అక్టోబర్ 23, 2025 By Rahul N
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘మన శంకర వర ప్రసాద్ గారు’ చిత్రానికి సంబంధించి తాజాగా బిగ్ అప్‌డేట్ వచ్చింది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్‌లో విక్టరీ వెంకటేశ్ కీలక పాత్రలో నటిస్తున్న తెలిసిందే. ‘F2’, ‘F3’ లాంటి సూపర్...
‘మన శంకర వర ప్రసాద్ గారు’ సెట్లోకి వచ్చేసిన వెంకీమామ!

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘మన శంకర వర ప్రసాద్ గారు’ చిత్రానికి సంబంధించి తాజాగా బిగ్ అప్‌డేట్ వచ్చింది.

అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్‌లో విక్టరీ వెంకటేశ్ కీలక పాత్రలో నటిస్తున్న తెలిసిందే. ‘F2’, ‘F3’ లాంటి సూపర్ హిట్ లాఫ్ రయాట్స్ తర్వాత అనిల్ రావిపూడి మళ్లీ వెంకటేశ్‌తో జట్టుకట్టడం విశేషం. ఈసారి ఆయనను మెగాస్టార్ చిరంజీవితో ఒకే ఫ్రేమ్‌లో చూడబోతుండటం అభిమానులకు డబుల్ సెలబ్రేషన్. వెంకటేశ్ ఈ సినిమాలో లెంగ్తీ, క్రూషియల్ రోల్‌లో కనిపించనున్నారని సమాచారం.

ప్రస్తుతం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన భారీ సెట్‌లో షూటింగ్ జరగుతోంది. వెంకటేశ్ ఈరోజు సెట్లో జాయిన్ అవ్వగా, చిరంజీవి – వెంకటేశ్‌లపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. మేకర్స్ విడుదల చేసిన వీడియోలో చిరంజీవి సంతోషంగా వెంకటేశ్‌కు వెల్‌కమ్ చెబుతుండగా, ఇద్దరి మధ్య స్నేహపూర్వక హగ్గులు, నవ్వులు సెట్లో పండగ వాతావరణాన్ని సృష్టించాయి.

ఇప్పటికే ఈ చిత్రంలోని ఫస్ట్ సింగిల్ “మీసాల పిల్ల” బ్లాక్‌బస్టర్ హిట్‌గా మారింది. భీమ్స్ సిసిరోలియో అందించిన ఈ పాటలో చిరంజీవి తన ప్లేఫుల్ అవతార్‌లో నయనతారను ఆటపట్టిస్తూ అద్భుతమైన కెమిస్ట్రీని స్క్రీన్‌పై చూపించారు.

టెక్నికల్ టీమ్ పరంగా కూడా ఈ చిత్రం చాలా స్ట్రాంగ్‌గా నిలుస్తోంది. షైన్ స్క్రీన్స్ మరియు గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై సాహు గారపాటి మరియు సుష్మిత కొణిదెల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్రాన్ని శ్రీమతి అర్చన సమర్పిస్తున్నారు.

“మన శంకర వర ప్రసాద్ గారు” 2026 సంక్రాంతి పండుగకు థియేటర్లలో విడుదల కానుంది. కామెడీ, ఎమోషన్, మాస్ ఎలిమెంట్స్ మేళవించిన ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్‌కు పర్ఫెక్ట్ ఫెస్టివ్ ట్రీట్‌గా మారనుంది.

Trending Now

No trending articles in this category from the last 3 days.

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading