వెకేషన్ మోడ్‌లో విజయ్–రష్మిక… మరోసారి వార్తల్లో స్టార్ జోడీ
డిసెంబర్ 26, 2025 Published by Srinivas

టాలీవుడ్ స్టార్ జోడీ విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న మరోసారి హాట్ టాపిక్‌గా మారారు. అధికారిక ప్రకటన లేకపోయినా, వీరిద్దరూ నిశ్చితార్థం చేసుకున్నారనే ప్రచారం ఇప్పటికే ఇండస్ట్రీలో జోరుగా నడుస్తోంది. తాజా బజ్ ప్రకారం, ఈ జోడీ 2026 ఫిబ్రవరిలో ఉదయ్‌పూర్‌లో వివాహం చేసుకునే ఆలోచనలో ఉన్నారని టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక నిర్ధారణ లేదు.
ఇదిలా ఉండగా, ఈ క్రేజ్ జోడీ కలిసి వెకేషన్‌కు బయలుదేరినట్టు తెలుస్తోంది. రష్మిక మందన్న తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఎయిర్‌పోర్ట్ నుంచి ఓ ఫోటో షేర్ చేస్తూ, చెక్-ఇన్ కౌంటర్ వద్ద లగేజీతో కనిపించారు. ఆ ఫోటోకు “And now it’s vacayyyy timeeee!!” అంటూ క్యాప్షన్ ఇవ్వడంతో ఫ్యాన్స్‌లో ఆసక్తి మరింత పెరిగింది. అదే సమయంలో క్యాప్ ధరించిన విజయ్ దేవరకొండ కూడా ఎయిర్‌పోర్ట్‌లో కనిపించడంతో ఇద్దరూ కలిసి ప్రయాణిస్తున్నారనే వార్తలకు బలం చేకూరింది.

పనివైపు చూస్తే, విజయ్ దేవరకొండ ప్రస్తుతం రౌడీ జనార్ధనతో పాటు దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ రూపొందిస్తున్న పీరియడ్ డ్రామా షూటింగ్‌లతో బిజీగా ఉన్నారు. వరుస షూటింగ్‌ల మధ్య ఈ చిన్న విరామం ఆయనకు ఊరటగా మారినట్టుగా తెలుస్తోంది. గత కొన్ని ఏళ్లలో విజయ్–రష్మిక కలిసి మాల్దీవులు, అమెరికా, ఒమన్ వంటి పలు దేశాలకు వెకేషన్‌లకు వెళ్లిన సంగతి తెలిసిందే.
సమాచారం ప్రకారం, ఈ జోడీ వచ్చే వారం హైదరాబాద్ కు తిరిగివచ్చి తమ తమ సినిమా షూటింగ్‌లను తిరిగి ప్రారంభించనున్నారు. ఇదే సమయంలో ఇద్దరి కొత్త సినిమాల అప్‌డేట్స్ కూడా అభిమానుల్లో ఉత్సాహం నింపుతున్నాయి. రష్మిక నటిస్తున్న మైసా గ్లింప్స్ ఇటీవల విడుదల కాగా, విజయ్ దేవరకొండ సినిమా ‘రౌడీ జనార్ధన’ టైటిల్ గ్లింప్స్ కూడా మంచి స్పందన పొందింది.
వెకేషన్ ఫోటోలు, సినిమా అప్‌డేట్స్, పెళ్లి వార్తలతో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జోడీని మరోసారి వార్తల్లో నిలిపాయి.
