సినిమా వార్తలు

విష్ణు విశాల్ ‘ఆర్యన్’ ట్రైలర్: నరాలు తెగే సస్పెన్స్‌తో ప్రేక్షకులను ఉత్కంఠకు గురి చేసే థ్రిల్లర్!

Published by
Srinivas

విష్ణు విశాల్ హీరోగా నటించిన మోస్ట్ ఎవైటెడ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘ఆర్యన్’ ట్రైలర్ విడుదలైంది. ప్రవీణ్ కె దర్శకత్వంలో, విష్ణు విశాల్ స్టూడియోజ్, శుభ్రా, ఆర్యన్ రమేష్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా ఇప్పటికే టీజర్, ఫస్ట్ సింగిల్‌తోనే అంచనాలను పెంచింది. ఇప్పుడు రిలీజ్ అయిన ట్రైలర్ అయితే, ఆ అంచనాలను మరో లెవల్‌కి తీసుకెళ్లింది.

ట్రైలర్ ప్రారంభం నుంచే రక్తం గడ్డ కట్టించే సస్పెన్స్‌తో నిండిపోయి ఉంది. ఒకప్పుడు కొడైకెనాల్ సీరియల్ కిల్లింగ్ కేస్‌ని సాల్వ్ చేసిన ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్, ఇప్పుడు ఓ టెర్రిఫిక్ సైకోపాత్‌ని పట్టుకునే మిషన్‌లో అడుగుపెడతాడు. హంతకుడు ప్రతి హత్యకు గంట ముందు పోలీసులను ఛాలెంజ్ చేస్తూ, చంపబోయే వ్యక్తి పేరు చెబుతాడు. దీంతో నగరమంతా భయాందోళనలో మునిగిపోతుంది. ఈ మర్డర్ మిస్టరీని ఛేదించడంలో ఆఫీసర్ ఎదుర్కొనే సైకలాజికల్ గేమ్స్, ఇంటెన్స్ హంటింగ్ సీన్స్ ట్రైలర్‌లో ఊపిరి బిగబట్టేలా చూపించారు.

దర్శకుడు ప్రవీణ్ కె ఒక యూనిక్ కథను ఎంచుకుని, ఆఫీసర్ – కిల్లర్ మధ్య జరిగే క్యాట్ అండ్ మౌస్ గేమ్‌లా టెన్షన్ నింపిన స్క్రీన్‌ప్లే రూపొందించాడు. విష్ణు విశాల్ తన పాత్రలో పూర్తిగా మునిగిపోయి, కమాండింగ్ ప్రెజెన్స్‌తో ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ముఖ్యంగా అతని బాడీ లాంగ్వేజ్, కళ్ళలోని ఫైర్ ఈ పాత్రకు పర్ఫెక్ట్‌గా సరిపోయాయి.

ట్రైలర్ చివర్లో సెల్వరాఘవన్ ఎంట్రీతో సస్పెన్స్ పీక్స్‌కి చేరింది. అతని ప్రెజెన్స్ ఒక కొత్త మిస్టరీని తెరపైకి తెచ్చేలా అనిపిస్తుంది. శ్రద్ధా శ్రీనాథ్, మానస చౌదరి హీరోయిన్స్‌గా కనిపించగా, వారి గ్లింప్స్ కూడా కథలో కీలకమైన టర్న్ సూచిస్తున్నాయి.

హరీష్ కన్నన్ కెమెరా వర్క్ సినిమాకి థ్రిల్లింగ్ టోన్ ఇచ్చింది. ప్రతి షాట్ విజువల్‌గా రిచ్‌గా, డార్క్ థ్రిల్లర్ మూడ్‌లోనూ ఉంది. గిబ్రాన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మాత్రం సినిమాకి హార్ట్‌లా పనిచేస్తూ సీన్‌ల టెన్షన్‌ని పీక్స్‌కి తీసుకెళ్లింది. సాన్ లోకేశ్ ఎడిటింగ్, మను ఆనంద్ సహ రచన చేసిన స్క్రీన్‌ప్లే – రెండూ సినిమాకి అదనపు బలం.

సాయి రోణక్, తరక్ పొన్నప్ప, మాల పార్వతి, అవినాష్, అభిషేక్ జోసెఫ్ జార్జ్ తదితరులు ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నారు. మొత్తం మీద ‘ఆర్యన్’ ట్రైలర్ థ్రిల్లింగ్ బ్యాక్‌డ్రాప్‌లో ఉత్కంఠ, మైండ్ గేమ్స్, యాక్షన్ అన్నీ కలగలిసిన ఇన్టెన్స్ అనుభూతిని ఇచ్చింది.

ఈ సైకలాజికల్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ థియేటర్లలో ఎప్పుడు రిలీజ్ అవుతుందన్న ఆసక్తి ఇప్పుడు అభిమానుల్లో పీక్‌కి చేరింది.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.