సినిమా వార్తలు

తల్లి అయిన పరిణితి చోప్రా.. దీపావళి ముందు ఈ స్టార్ జంట ఇంట్లో వెలుగుల పండుగే!

Published by
Srinivas

బాలీవుడ్ అందాల తార పరిణితి చోప్రా, ఆమ్ ఆద్మీ పార్టీ యువ నాయకుడు రాఘవ్ చద్దా దంపతుల ఇంట సంతోషకరమైన వార్త వినిపిస్తోంది. ఈ స్టార్ జంట పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు.

2023 మేలో ఢిల్లీలోని కపుర్థాలా హౌస్‌లో నిశ్చితార్థం చేసుకున్న వీరు, అదే ఏడాది సెప్టెంబర్‌లో రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో జరిగిన రాయల్ వేడుకలో వివాహ బంధంలో అడుగుపెట్టారు. ఈ జంట పెళ్లి బాలీవుడ్‌లో పెద్ద సంచలనంగా నిలిచింది.

ఇక తాజాగా పరిణితి తల్లి కాబోతోందన్న వార్తలు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఆ వార్తలు నిజమవుతూ, ఈ ఉదయం పండంటి బిడ్డకు జన్మనిచ్చిందని అధికారికంగా ప్రకటించారు. తాము ఎంతోకాలంగా ఎదురు చూసిన ఈ రోజు ఎట్టకేలకు వచ్చిందని, “మా హృదయాలు ఆనందంతో నిండిపోయాయి… మా బేబీ బాయ్ వచ్చాడు! అతన్ని చేతిలోకి తీసుకోవడానికి ఇక ఆగలేము. మీ అందరి ప్రేమ, ఆశీస్సులకు ధన్యవాదాలు” అంటూ పరిణితి హృదయపూర్వకంగా అభిమానులతో పంచుకుంది.

ఇక ఈ ఆనంద వార్త తెలిసిన వెంటనే పరిణితి అక్క, గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా, అమెరికా నుంచి ఇండియాకు బయలుదేరినట్లు సమాచారం. సోదరి తల్లి అయిన ఆనందంలో ప్రియాంక ఉప్పొంగిపోతున్నట్లు బీ-టౌన్ వర్గాలు చెబుతున్నాయి. ప్రియాంకకు ఇప్పటికే చిన్నారి కూతురు మల్టీ ఉంది, ఇప్పుడు కుటుంబంలో కొత్త బేబీ బాయ్ చేరడంతో చోప్రా ఫ్యామిలీ డబుల్ సెలబ్రేషన్ మోడ్‌లోకి వెళ్లిపోయింది.

దీపావళి ముందు ఈ స్టార్ జంట ఇంట్లో వెలుగుల పండుగే మొదలైనట్టైంది.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.

Recent Posts