Download App

‘అఖండ 2’, ‘OG’ రికార్డులని బీట్ చేస్తుందా ?

డిసెంబర్ 10, 2025 • By Rahul N
బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్‌ అంటే టాలీవుడ్‌ ప్రేక్షకులకు ప్రత్యేకమైన ఎగ్జైట్‌మెంట్‌. ఈ కాంబోలో ఇంతకు ముందు చేసిన “సింహా”, “లెజెండ్”, “అఖండ” మూడు సినిమాలు కూడా బ్లాక్‌బస్టర్‌ హిట్లు కావడంతో, ఇప్పుడు వస్తున్న “అఖండ 2” పై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇప్పటికే “OG” చిత్రం 2025లో...
'అఖండ 2', 'OG' రికార్డులని బీట్ చేస్తుందా ?

బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్‌ అంటే టాలీవుడ్‌ ప్రేక్షకులకు ప్రత్యేకమైన ఎగ్జైట్‌మెంట్‌. ఈ కాంబోలో ఇంతకు ముందు చేసిన “సింహా”, “లెజెండ్”, “అఖండ” మూడు సినిమాలు కూడా బ్లాక్‌బస్టర్‌ హిట్లు కావడంతో, ఇప్పుడు వస్తున్న “అఖండ 2” పై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి.

ఇప్పటికే “OG” చిత్రం 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలుస్తుండగా, “అఖండ 2” దాన్ని దాటే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. పవన్ కళ్యాణ్, సుజీత్ కాంబినేషన్‌లో వచ్చిన “OG” బాక్సాఫీస్‌ వద్ద భారీ ఓపెనింగ్‌ సాధించినప్పటికీ, రెండో వారంలో వసూళ్లు కాస్త తగ్గాయి. ఈ నేపథ్యంలో, బోయపాటి మార్క్‌ మాస్‌ మంత్రంతో “అఖండ 2” బాక్సాఫీస్‌ వద్ద సునామీ సృష్టించే అవకాశముందని అంచనా.

‘అఖండ 2’ డిసెంబర్ 5 నే రిలీజ్ అవ్వాల్సి ఉండగా, ఆర్ధిక కారణాల వల్ల వాయిదా పడి, డిసెంబర్ 12న రిలీజ్ కి సిద్ధమైంది. 11 రాత్రి నుండే ప్రీమియర్ల ప్లాన్ చేసారు. ఇందులో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్నారని సమాచారం. “అఖండ”లో అఘోర పాత్రతో ఫ్యాన్స్‌ ఫుల్‌ ఫ్రెంజీకి లోనవ్వగా, సీక్వెల్‌లో ఆ పవర్‌ మరింత పెరగనుంది. బోయపాటి శ్రీను ఇప్పటికే హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌లు ప్లాన్‌ చేయగా, థియేటర్లలో మాస్ ఫెస్టివల్‌ ఉండబోతోందని యూనిట్‌ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ గూస్ బంప్స్ తెప్పించింది. దీంతో అభిమానులు అఖండ కంటే పెద్ద హిట్ ఖాయమని నమ్ముతున్నారు.

ఇక “OG” సినిమాకు ఉన్న రికార్డును దాటాలంటే, “అఖండ 2” కనీసం రూ.310 కోట్లకు పైగా ప్రపంచవ్యాప్తంగా వసూలు చేయాల్సి ఉంటుంది. ట్రేడ్ సర్కిల్స్ ప్రకారం, “అఖండ 2” తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా, కర్ణాటక, ఉత్తర భారత మార్కెట్లలో కూడా బలమైన ఓపెనింగ్‌ సాధించే అవకాశం ఉంది.

బోయపాటి స్టైల్‌ యాక్షన్‌, బాలయ్య ఎనర్జీ చూస్తే ప్రేక్షకుల అంచనాలు “అఖండ 2” నిజంగా “OG” వసూళ్లను బీట్‌ చేసే అవకాశాలు ఉన్నాయనే మాట వినిపిస్తోంది. ఇప్పుడు అందరి చూపు అఖండ 2 పైనే ఉంది.

“బాలయ్య మాస్ మంత్రం మళ్లీ పని చేస్తుందా? ‘అఖండ 2’ తో ‘OG’ రికార్డును బీట్ చేస్తాడా?” అనే ప్రశ్న ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading