డాన్స్ నంబర్ నాకు చాలా ఇష్టం.. కాంత పూర్తిగా భిన్నం: భాగ్యశ్రీ బోర్సే
November 13, 2025 Published by Srinivas

దుల్కర్ సల్మాన్ నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక పీరియాడికల్ డ్రామా ‘కాంత’ నవంబర్ 14న గ్రాండ్‌గా విడుదలకు సిద్ధమవుతోంది. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రానా దగ్గుబాటి, సముద్రఖని కీలక పాత్రల్లో నటించగా, హీరోయిన్‌గా భాగ్యశ్రీ బోర్సే కనిపించనున్నారు. దుల్కర్ సల్మాన్ ‘వేఫేర్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్’, రానా దగ్గుబాటి ‘స్పిరిట్ మీడియా’ కలిసి నిర్మించిన ఈ చిత్రానికి టీజర్, ట్రైలర్, పాటలకు ఇప్పటికే అద్భుతమైన స్పందన లభిస్తోంది.
సినిమా విడుదల సందర్భంలో హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే చిత్ర విశేషాలను పంచుకున్నారు.
కుమారి పాత్రతో నాకు కొత్త నటిగా ఎనలేని అవకాశం లభించింది
కుమారి పాత్రలో నటించడానికి ఫుల్ పెర్ఫార్మెన్స్ స్కోప్ ఉంది. దుల్కర్ సర్, రానా సర్‌లతో స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా పెద్ద ఆనందం. న్యూ కమర్‌కి ఇలా ఛాలెంజింగ్ రోల్ రావడం అదృష్టంగా భావిస్తున్నాను.
1960ల కాలాన్ని రీక్రియేట్ చేయాల్సిన అవసరంతో పాత్రపై విస్తృతంగా గ్రౌండ్ వర్క్ చేసినట్లు ఆమె చెప్పింది.
“ఆ కాలం సినిమాలు, ముఖ్యంగా శ్రీదేవి గారు, సావిత్రి గారి నటనను చూసి ఇన్స్పిరేషన్ తీసుకున్నాను. దర్శకుడు సెల్వ గారు ఇచ్చిన సపోర్ట్ వల్ల కుమారి పాత్ర అద్భుతంగా రావొచ్చు.”
టెక్నికల్‌గా నేను సైన్ చేసిన తొలి చిత్రం ‘కాంత’
ఇది తాను మొదట సైన్ చేసిన చిత్రం అని భాగ్యశ్రీ వెల్లడించింది. “కొన్ని కారణాల వల్ల షూటింగ్ ఆలస్యమైంది. ఆ గ్యాప్‌లో రెండు సినిమాలు చేసింది. అయినప్పటికీ ‘కాంత’ నాకు ఫస్ట్ సైన్ చేసిన సినిమా అనే గుర్తింపు ఉంది.”
షూటింగ్ అనుభవం
2023 నుండి ఇప్పటి వరకు ఒక అందమైన జర్నీ. సెట్లో అందరం ఫ్రెండ్స్ లా పనిచేశాం. పూర్తిగా పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ క్యారెక్టర్. న్యూ కమ్మర్‌గా ఇలాంటి ఛాన్స్ రావడం చాలా అరుదు.
రానా దగ్గుబాటి గురించి: “ఆయనకు సినిమా అంటే పాషన్”
రానా సర్‌తో పనిచేయడం నా అదృష్టం. సినిమా గురించే మాట్లాడుతారు. నటనలో, డెడికేషన్‌లో ఆయన నుంచి చాలా నేర్చుకున్నాను. ఒక గ్రేట్ పెర్ఫార్మర్.

దర్శకుడు సెల్వమణి సెల్వరాజ్ గురించి
సెల్వ సర్ చాలా టాలెంటెడ్. ఆయన రాసిన కుమారి పాత్ర నన్నే ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రతి యాక్టర్ నుంచి బెస్ట్ తీసుకుని చాలా ప్యూర్, హృద్యమైన చిత్రాన్ని తీశారు.
టాలీవుడ్ స్టార్‌లతో వరుసగా వర్క్ చేసిన అనుభవం
రవితేజ, విజయ్ దేవరకొండ తర్వాత ఇప్పుడు దుల్కర్ సల్మాన్‌తో చేసిన అనుభవం గురించి మాట్లాడుతూ… కెరీర్ ప్రారంభంలోనే ఇంత పెద్ద స్టార్స్‌తో వర్క్ చేయడం అదృష్టం. అందరూ ఎంతో కైండ్‌గా, సపోర్టివ్‌గా ఉన్నారు.
‘కాంత’ & ‘ఆంధ్ర కింగ్’ బ్యాక్-టు-బ్యాక్ రిలీజ్ పై స్పందన
ఈ రెండు చిత్రాలు వరుసగా విడుదల అవుతుండటం చాలా ఎక్సయిటింగ్ అలాగే కొంచెం నెర్వస్‌గా కూడా ఉంది. కానీ నేను 100% ఇచ్చాను. మంచి ఫలితం వస్తుందనే నమ్మకం ఉంది.
“ఈ సినిమా తర్వాత ‘భాగ్యశ్రీ పర్ఫార్మర్’ అని చెబుతారని ఆశిస్తున్నాను”
ఇప్పటివరకు నాకు కమర్షియల్ పాత్రలే వచ్చాయి. కానీ ‘కాంత’ నటనకు మంచి అవకాశం ఇచ్చింది. నా నటనను ప్రేక్షకులు గుర్తిస్తే అదే నాకు పెద్ద రివార్డ్.
సంగీతం – ప్రత్యేక ఆకర్షణ
సినిమాలోని డాన్స్ నంబర్ నాకు చాలా ఇష్టం. మ్యూజిక్ ఈ చిత్రంలో హైలైట్‌గా ఉంటుంది.
తమిళ్ డెబ్యూ పై స్పందన
ఒక ఆర్టిస్ట్‌కు లాంగ్వేజ్ బ్యారియర్ ఉండదు. మంచి స్క్రిప్ట్ ఉంటే ఏ భాషలోనైనా చేస్తాను. అయినా నా ఫస్ట్ ప్రిఫరెన్స్ తెలుగు సినిమాకే.
కొత్త ప్రాజెక్టులు
తెలుగు, హిందీ భాషల్లో కొన్ని ప్రాజెక్టులు చేస్తున్నాను. వివరాలు త్వరలో మేకర్స్ ప్రకటిస్తారు. కాంతలోనూ, ఆంధ్ర కింగ్‌లోనూ నా పాత్రలు పూర్తిగా భిన్నం
‘కాంత’లో సినిమా లో సినిమా ఉంటుంది. ‘ఆంధ్ర కింగ్’ ఒక ఫ్యాన్ బయోపిక్. రెండు కథలు కూడా పూర్తిగా వేరే వేరే జానర్స్. కుమారి, మహాలక్ష్మి పాత్రలకు పోలిక లేదు. ప్రేక్షకులు ఇరు సినిమాలను తప్పకుండా ప్రేమిస్తారనే నమ్మకం ఉంది.
