వార్తలు

మన ప్రధానికి మరొక… పౌర పురస్కారం

Published by
Srinivas

మన ప్రధాని నరేంద్ర మోడీకి మరొక అంతర్జాతీయ పౌర పురస్కారం… ప్రస్తుతం విదేశి పర్యటన లో భాగంగా, జోర్డాన్, ఇథియోపియా, ఒమన్ దేశాల పర్యటన లో ఉన్నారు. జోర్డాన్ పర్యటన అనంతరం ఇథియోపియా చేరుకున్నారు.

ఈ సందర్భంగా గా ఈథియోపియా ప్రధాని అబీ అహ్మద్ అలీ భారత ప్రధాని మోడీ నీ సాదరంగా ఆహ్వానించి తోడ్కొని వెళ్ళారు. ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారం అయిన “The great honor nishan of Ethiopia” ఇచ్చి భారత ప్రధాని మోదీ ని ఘనంగా సత్కరించినది ఇథియోపియా ప్రభుత్వం .

మోదీ జి కి ఈ అవార్డు తో కలిపి ఇప్పటివరకు 28 విదేశీ గౌరవ పురస్కారాలు లభించాయి…. ఇది ఏ భారత ప్రధానికి ఇన్ని పురస్కారాలు లభించలేదు. అలాగే విదేశీ అధ్యక్షులకు లేదా ఇతర ప్రభుత్వాధినేతలకు ఇథియోపియా ఈ గౌరవ పురస్కారం ఇవ్వడం కూడా ఇదే మొదటిసారి.

ఈ అత్యున్నత గౌరవ పౌర పురస్కారం ని వినయం తో స్వీకరిస్తున్నానని చెబుతూ…. ప్రధాని మోదీ తన ప్రసంగంలో…. ప్రపంచంలోనే అత్యంత ప్రాచీన, సుసంపన్న నాగరికతలలో ఒకటని ఈథియోపియా ను శ్లాఘించారు. ఈ గౌరవం నాకు దక్కడం చాలా అదృష్టం గా భావిస్తున్నా…. ఈ గౌరవాన్ని 140 కోట్ల భారత ప్రజలకు అంకితం చేస్తున్నా అన్నారు.

భారత-ఇథియోపియా దేశాల మధ్య రాజకీయ, ఆర్థిక, విద్యా, టెక్నాలజీ, సౌర శక్తి, రక్షణ, వ్యవసాయ మరియు సాంస్కృతిక రంగాల్లో సుస్థిరమైన భాగస్వామ్యాన్ని పెంపొందించడానికి, ఇరు దేశాల సంబంధాలను మరింత బలపర్చడంలో భారత ప్రధాని మోదీ చేస్తున్న కృషికి… ఈథియోపియా ప్రధాని అబీ అహ్మద్ అలీ ధన్యవాదాలు తెలిపారు.

Srinivas