పృధ్వీరాజ్ చవాన్ 2010 నుండి 2014 వరకు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు. అంతకు ముందు కేంద్ర మంత్రి గా మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో 2004-2009 మధ్య కాలంలో సైన్స్ & టెక్నాలజీ , పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మరియు ప్రధానమంత్రి కార్యాలయంలో సహాయ మంత్రిగా పనిచేశారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (AICC) ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేశారు.
పూణేలో పృధ్వీరాజ్ చవాన్ వ్యాఖ్యల సారాంశం:
ఆపరేషన్ సింధూర్ లో భారతదేశం మొదటి రోజే పరాజయం పాలైంది. మన వైమానిక దళ విమానాలు గ్రౌండ్ కే పరిమితమయ్యాయి. భవిష్యత్తు లో యుద్ధాలు భూమి మీద కాకుండా వాయు సేన – క్షిపణుల మీద నే ఆధారపడి జరుగుతాయి అని అన్నారు. ఈ వ్యాఖ్యలపై విమర్శలు వచ్చినా క్షమాపణ చెప్పనని స్పష్టం చేశారు.
దీనిపైన దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీ నాయకులు, సానుభూతి పరులే కాకుండా…. అన్ని వర్గాల ప్రజల నుండి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇది మన దేశ రక్షణ దళాలు ను అవమానించడమే అని విమర్శిస్తున్నారు. మొన్నటి వరకు ఒక బాధ్యతాయుత స్థానంలో ఉన్న వ్యక్తి నుండి రావలసిన మాటలు ఇవేనా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
కాంగ్రెస్ విమర్శల ఫలితంగా మన దేశ సైనికుల గౌరవం, నైతిక సామర్థ్యాన్ని ప్రపంచ దేశాల ముందు ఎలా ఉంటుందో వ్యాఖ్యలు చేసేముందు ఆలోచించాలి అని బీజేపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు.