
ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ లో రాజమహేంద్రవరం పట్టణంలో కల్తీ చేసిన పాల వినియోగం వల్ల నలుగురు మృతి చెందారు. ఇద్దరు వెంటిలేటర్ పై ఉన్నారని ఏపీ సీఎం చంద్రబాబు అసెంబ్లీ లో తెలిపారు. మృతుల కి ఒక్కొక్కరికీ 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం ను చంద్రబాబు నాయుడు ప్రకటించారు. మరో ఎనిమిది మందికి వైద్య సహాయం కొనసాగుతుందన్నారు.
ఈ కల్తీపాల నిందితుడు నాగేశ్వరరావుని పోలీసులు అరెస్ట్ చేశారని, వైద్యాధికారుల బృందం ఈ పాలు సేవించిన అందరి నుండి బ్లడ్ శాంపిల్స్ సేకరించి, వాటిని ల్యాబ్ కు పంపి, టెస్టులు జరుపుతున్నాయి అని వాళ్ళకి సరైన చికిత్స అందించే విధంగా ఏర్పాట్లు చేసినట్లుగా చంద్రబాబు నాయుడు అసెంబ్లీ ప్రకటించారు. ఆ పాలు తాగడం వల్లనే డయాలసిస్ సమస్యలు వచ్చి అనారోగ్యం పాలయినట్లుగా ఆయన అసెంబ్లీలో చెప్పారు.
పాలల్లో కల్తీ చేసిన మూలంగా “అనురియా” (Anuria) అంటే శరీరంలో మూత్రపిండాలు మూత్రాన్ని సరిగ్గా ఉత్పత్తి చేయకపోవడం లేదా చాలా తక్కువగా ఉత్పత్తి చేసే తీవ్రమైన స్థితికి చేరుకోవడాన్ని “అనురియా” అంటారు. ఇది తీవ్రమైన మూత్రపిండాల వ్యాధి. దీని మూలంగానే ఈ నలుగురు చనిపోయారని వైద్య బృందాలు విశ్లేషిస్తున్నాయి.
24 గంటల్లో 100 మిల్లీలీటర్ల కంటే తక్కువ మూత్ర విసర్జన జరగడం లేదా అసలు జరగకపోవడం. దాని మూలంగా, కిడ్నీలు దెబ్బతినడం. దాని వలన మూత్ర ప్రవాహాం దెబ్బతినడం తో, తీవ్రమైన వాంతులు, విరేచనాలు లేదా అధిక రక్త నష్టం వల్ల రక్తపోటు తగ్గిపోవడం. ఇది మూత్రపిండాల వైఫల్యానికి దారి తీస్తుంది అని దాని మూలంగా మరణాలు సంభవించవచ్చని వైద్య బృందాలు చెబుతున్నాయి.
