Download App

భారత్ పై ‘ట్రంప్’ సుంకాలు తగ్గింపు… భయంతోనా…?

ఫిబ్రవరి 3, 2026 By Suresh Thota
అతడు సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. "జింకను వేటాడ్డానికి పులి ఎంత ఓపిగ్గా ఉంటుందో తెలుసా… అటువంటి పులిని వేటాడాలి అంటే ఇంకెంత ఓపిగ్గా ఉండాలి" ఇది ఆ సన్నివేశం లోని సారాంశం… ఇక్కడ పులి అమెరికా అవునో కాదో చెప్పలేము, కాని నిస్సందేహంగా ఆ వేటగాడు మాత్రం…...
భారత్ పై 'ట్రంప్' సుంకాలు తగ్గింపు… భయంతోనా…?

అతడు సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. “జింకను వేటాడ్డానికి పులి ఎంత ఓపిగ్గా ఉంటుందో తెలుసా… అటువంటి పులిని వేటాడాలి అంటే ఇంకెంత ఓపిగ్గా ఉండాలి” ఇది ఆ సన్నివేశం లోని సారాంశం… ఇక్కడ పులి అమెరికా అవునో కాదో చెప్పలేము, కాని నిస్సందేహంగా ఆ వేటగాడు మాత్రం… “నరేంద్ర మోడీ”నే… అవును ఇది నిజం.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సొంత సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. భారత్ మీద సుంకాలను 18% తగ్గిస్తున్నాము అని… అక్కడి వరకు ఒకే… భారత్ ఆయిల్స్ ని రష్యా నుండి కొనము అని చెప్పారు అని అన్నారు. దీనికి భారత్ నుంచి ఎటువంటి సమాచారం లేదు…. అవునని కాని, కాదని కాని… అదే సమయంలో మోడీ కూడా ధన్యవాదాలు చెప్పారు. 140 కోట్ల భారతీయుల తరపున సుంకాలు తగ్గించి నందుకు మాత్రమే… అదే మోడీ గొప్పతనం.

అమెరికా గురించి ఒక ప్రసిద్ధమైన కొటేషన్ ను ఆ దేశపు దౌత్యవేత్త “హెన్రీ కిసెంజర్” ఈవిధంగా ఉటంకించారు.

“To be an enemy of America can be dangerous, but to be a friend is fatal.”

“అమెరికా కు శత్రువు గా ఉండటం ప్రమాదకరం మిత్రుడు గా ఉండటం ప్రాణాంతకం”.

అంతర్జాతీయ రాజకీయాల్లో “శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రువులు ఉండరు.. కేవలం శాశ్వత ప్రయోజనాలు మాత్రమే ఉంటాయి” అనే సిద్ధాంతానికి ఈ వ్యాఖ్యలు ఒక నిదర్శనం.

భారత్ పై 'ట్రంప్' సుంకాలు తగ్గింపు… భయంతోనా…?

భారత దేశం… మా నుండి, వెనిజులా నుండి ఆయిల్స్ కొనబోతున్నారు. అక్కడివరకు ఓకే… కాని రష్యా నుండి కోనబోము అని అన్నారు అన్న మాటలకు… మోడీ నోటి నుండి జవాబు వచ్చే వరకు ట్రంప్ మాట కు విలువ లేదు. భారత దేశం ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం, ఇందులో 6 జాతీయ పార్టీలు, 67 రాష్ట్ర పార్టీలు, గుర్తింపు లేని పార్టీ లు ఇంకా చాలా ఉన్నాయి. ఇంత మంది భారత రాజకీయ నాయకులు ని, వాళ్ళ మనస్తత్వాలను చదివిన మోడీ కి ట్రంప్ గురించి ఆ మాత్రం తెలియదా… జర్మన్ వార్తాపత్రిక Frankfurter Allgemeine Zeitung (FAZ) ప్రకారం ట్రంప్ మోడీకి నాలుగు సార్లు ఫోన్ చేశారు, కానీ మోడీ స్పందించలేదని తెలిపింది.

అమెరికా అధ్యక్షుడు విందు కి పిలిచిన వెళ్లకుండా సున్నితంగా తిరస్కరించి వచ్చేసిన మన ప్రధాని మోడీ అమెరికాను విశ్వసిస్తారా అన్నది ప్రశ్నార్థకమే…! మన దేశ వస్త్ర పరిశ్రమ, ఆక్వారంగం ట్రంపు యొక్క సుంకాలతో కొంత ఒడిదుడుకులకు గురైన మాట వాస్తవమే… బంగ్లాదేశ్ అమెరికా అండతో ఇష్టం వచ్చిన రీతిలో వ్యవహరించడంతో భారత కు బాగా కలసి వచ్చింది. ఎలా అంటే మన కన్నా తక్కువ రేట్లకు వస్త్రాలను ఎగుమతి చేయడం తో పాటు మన రోడ్లు, పోర్టులు ఇష్టారీతిన వాడుకోవడం బంగ్లాదేశ్ కు కలసి వచ్చింది. ఎప్పుడైతే మనం పవర్, రోడ్లు, పోర్టు లను వాడుకోవడంలో నిబంధనలు విధించామో అక్కడ వస్త్ర పరిశ్రమ కుదేలు అయింది… మొన్న క్రిస్మస్ కు EU దేశాలకు తెలిసి వచ్చింది. మునుముందు జరగబోయే అంశాలను అంచనా వేసుకుని తొందరగా FTA కుదుర్చుకున్నారు. ఇక ఆక్వారంగం అయితే మనం ఎగుమతి చేసిన రొయ్యలను, మన దగ్గర కొన్న దేశాలు పైన ఉన్న స్టిక్కర్ లు మార్చి అమెరికాకు ఎగుమతి చేస్తున్నాయి. ఇది ఎలా ఉంది అంటే మన దగ్గర కొనకుండా వేరే దేశం నుండి మనదేశ టీ పౌడర్ ని దిగుమతి చేసుకుంటున్న పాకిస్తాన్ లా ఉంది… అమెరికా తీరు.

EU స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం తర్వాత అమెరికా కి ఏమి చేయాలో పాలుపోవడం లేదు… హుంకరింపులు తప్ప, దేశంలో కూడా ట్రంప్ కు వ్యతిరేకంగా చాలా మంది మాట్లాడుతున్నారు. అమెరికా బాండ్స్ ను భారత్ , చైనా లు అమ్మివేసి బంగారం పై పెట్టుబడి పెట్టడంతో… అమెరికాఏమి చేయలేని స్థితిలోకి నెట్టివేయబడుతుంది. ఇలా అన్నిరకాలుగా ఒత్తిడి కి లోను అవడం వలన, భారత పై సుంకాలు తగ్గించి బుజ్జగించాలని చూస్తున్నారు. భారతదేశ ప్రయోజనాలు కి భంగం కలిగే అంశాలను మోడీ ఒప్పుకునే అవకాశాలు శూన్యం.

ఎప్పుడైనా ఆలోచన కలిగిన బలమైన నాయకత్వం ఉంటే… ఆ దేశం వేగంగా ఆర్థికాభివృద్ధి చెందుతుంది… నిదర్శనం… నేటి భారతం.

Suresh Thota

సురేష్ తోట ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్. సినిమా, రాజకీయాలు మరియు సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక వ్యాసాలు రచించడం ఆయన ప్రత్యేకత. సమకాలీన పరిణామాలపై లోతైన అవగాహనతో, వాస్తవాధారిత దృక్కోణంలో పాఠకులకు స్పష్టమైన, సమగ్ర సమాచారాన్ని అందించడం ఆయన రచనా శైలిలో ప్రధాన లక్షణం.

View all posts

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading