వార్తలు

ఇరాన్ పై దాడులు… మోడీ పర్యటన కోసం ఆగిన ఇజ్రాయెల్…

Published by
Suresh Thota

ఇరాన్ లోని టెహ్రాన్ నగరంపై దాడులు మొదలుపెట్టిన ఇజ్రాయెల్. ప్రపంచం మొత్తం షాక్ గురయ్యే విధంగా ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడులు ఈ రోజు మొదలుపెట్టింది. మొన్న భారత ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన మూలంగా దాడులు వాయిదా వేసుకుని మోదీ తిరిగి వెళ్లిన తరువాత మొదలు పెట్టడం గమనార్హం.

అంతర్జాతీయ విశ్లేషకులు ఈ విధంగా జరుగవచ్చు అని మొన్నటినుండి విశ్లేషిస్తున్నారు. అమెరికా తమ సిబ్బంది ని, ఇజ్రాయెల్ను వెంటనే వదిలిపెట్టి వెళ్లిపోవాలని ఆ దేశం లోని అమెరికా రాయబారి మైక్ హుకబీ తన కార్యాలయంలోని సిబ్బందికి శుక్రవారం సూచించారు. ఇరాన్తో ఏ క్షణమైనా యుద్ధం తప్పదని.. శుక్రవారం ఉదయం సిబ్బందికి ఈ మేరకు సూచనలు పంపారు. ‘రాయబార కార్యాలయం సిబ్బంది ఇజ్రాయెల్ను వదిలిపెట్టి వెళ్లిపోవాలని అనుకుంటే ఈ రోజే వెళ్లిపోండి. అందుబాటులో ఉన్న విమానం ఎక్కి వాషింగ్టన్ బయలుదేరండి. ముందైతే ఏదో ఒక రకంగా ఇజ్రాయెల్ నుంచి బయట పడండి’ అని సూచించారు.

ఇరాన్ మరియు అమెరికా ప్రతినిధుల మధ్య జెనీవాలో శుక్రవారం కూడా చర్చలు జరిగాయి. కాని అవి అంత సంతృప్తికరంగా జరగలేదని అంతర్జాతీయ మీడియా లో వార్తలు వస్తున్న నేపథ్యంలో… ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ రాజధాని టెహ్రాన్ పై దాడి తో రూడి అవుతుంది.

ఇజ్రాయెల్ క్షిపణి దాడుల సందర్భంగా భారీ పేలుళ్ళ తో టెహ్రాన్ దద్దరిల్లిపోయింది. ఇరాన్ కూడా ప్రతి దాడులు చేసే అవకాశం ఉంది. ఇరాన్ సుప్రీం లీడర్ ఆయూతుల్లా ఖమేని ని లక్ష్యంగా గా చేసుకుని దాడులు చేసిన ఇజ్రాయిల్. రెండు దేశాలు తమ గగన తలాన్ని మూసివేసాయి. ముస్లింలకు పవిత్ర రంజాన్ మాసం కావడం మూలంగా, ఇతర ముస్లిమ్ దేశాలు ఏ విధంగా స్పందిస్తాయి అని అంతర్జాతీయ రక్షణ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు.

Suresh Thota

Recent Posts