వార్తలు

దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఆయూతుల్లా ఖమేని మృతి

Published by
Suresh Thota

ఇరాన్ సుప్రీమ్ లీడర్ “అయతుల్లా ఖమేని” మరణం తో ప్రపంచవ్యాప్తంగా చర్చ మొదలైంది. ఆయన మరణాన్ని ఇరాన్ మీడియా ధృవీకరించింది. మధ్యప్రాచ్య రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన ఇరాన్ సుప్రీమ్ లీడర్ ఆయూతుల్లా ఖమేని మరణించిన వార్త, అంతర్జాతీయ మీడియా వర్గాల్లో సంచలనం సృష్టించింది.

ఆయూతుల్లా ఖమేని

1989 నుంచి Iran దేశానికి సుప్రీమ్ లీడర్‌గా ఉన్నారు. ఇస్లామిక్ రిపబ్లిక్ వ్యవస్థలో సుప్రీమ్ లీడర్ పదవి అత్యంత శక్తివంతమైనది. దేశ సైన్యం, న్యాయవ్యవస్థ, విదేశాంగ విధానం వంటి కీలక వ్యవహారాలపై చివరి నిర్ణయం సుప్రీమ్ లీడర్ చేతుల్లోనే ఉంటుంది.

1939లో జన్మించిన ఖమేని మొదట మతపెద్దగా ఎదిగి, తరువాత రాజకీయాల్లోకి ప్రవేశించారు. 1979 లో జరిగిన ఇరాన్ ఇస్లామిక్ విప్లవంలో ఆయన నిర్ణయాత్మక పాత్ర పోషించారు.

ఖొమేనీ మరణం (3 జూన్ 1989) తర్వాత ఆసెంబ్లీ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్ 4 జూన్ 1989న ఖమేనీ ఎన్నిక (60/74 వోట్లు). మొదట్లో మర్జా (ఉన్నత మతపరమైన స్థాయి) కావాలనే నిబంధన ఉండేది కానీ రాజ్యాంగ సవరణతో తొలగించారు. సైన్యం కమాండర్-ఇన్-చీఫ్, గార్డియన్ కౌన్సిల్ నియామకాలు, బోన్యాడ్‌లు (ఆర్థిక సంస్థలు) నియంత్రణ, మీడియా, న్యాయవ్యవస్థపై పూర్తి అధికారం ఖమేనీ కలిగి ఉన్నారు. విదేశాంగ విధానం.. షియా ముస్లిం సమాజానికి ఈయనే పెద్ద.

తాజాగా వెలువడుతున్న నివేదికల ప్రకారం, ఇరాన్ రాజధాని టెహ్రాన్ లో ఆయన నివాసం పై జరిగిన దాడులలో ఖమేని తో పాటు ఆయన అల్లుడు, కుమార్తె , మనవరాలు మరణించినట్లు తెలిపి , 40 రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఇజ్రాయెల్ అధ్యక్షుడు నేతన్యాహు కూడా ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించారు. అంతర్జాతీయం గా కూడా ఈ వార్త చర్చనీయాంశమం గా మారింది.

ప్రపంచ రాజకీయాలపై ప్రభావం అయుతుల్లా ఖమేని మరణం తో , ఇరాన్ రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. కొత్త సుప్రీమ్ లీడర్ ఎంపిక, ప్రాంతీయ రాజకీయాలు, మధ్యప్రాచ్య భద్రత వంటి అంశాలపై దీని ప్రభావం ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. మొన్నటి వరకు ఇరాన్ రాజధాని టెహ్రాన్లో ప్రజలు రోడ్ల మీదకు వచ్చి నిరసనలు వ్యక్తం చేయడం తెలిసిందే.
సంక్షిప్తంగా:

దాదాపు మూడు దశాబ్దాల పాటు ఇరాన్ రాజకీయాలను ప్రభావితం చేసిన ఖమేని మరణం వార్త ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి రేపుతోంది.

Suresh Thota

Recent Posts