వార్తలు

నేడు బంగారం ధరలు తగ్గుముఖం.. హైదరాబాద్, విజయవాడలో తాజా గోల్డ్, సిల్వర్ రేట్లు

Published by
Rahul N

గత రెండు రోజులుగా వరుసగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలకు శుక్రవారం బ్రేక్ పడింది. దేశీయ మార్కెట్లో పసిడి ధరలు స్వల్పంగా తగ్గగా, వెండి ధర కూడా కాస్త దిగివచ్చింది.

గుడ్ రిటర్న్స్ వివరాల ప్రకారం, శుక్రవారం ఉదయం 6 గంటల నాటికి హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,46,170గా నమోదైంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,33,900గా ఉంది.

ఇక వెండి విషయానికి వస్తే.. కిలోకు రూ.100 తగ్గి, ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడల్లో కిలో వెండి ధర రూ.2,44,900గా కొనసాగుతోంది.

అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు, డాలర్ మారకం విలువ, దిగుమతి సుంకాలు వంటి పలు అంశాల ప్రభావంతో బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ హెచ్చుతగ్గులు చోటుచేసుకుంటుంటాయి. అందువల్ల కొనుగోలు చేసే ముందు స్థానిక జువెలరీ షాపుల్లో తాజా ధరలు తెలుసుకోవడం ఉత్తమం.

నగరం 24 క్యారెట్లు 22 క్యారెట్లు 18 క్యారెట్లు
తెలంగాణలోని ప్రధాన నగరాల్లో 10 గ్రాముల బంగారం ధరలు
హైదరాబాద్ రూ.1,46,170 రూ.1,33,990 రూ.1,09,630
నిజామాబాద్ రూ.1,46,170 రూ.1,33,990 రూ.1,09,630
ఖమ్మం రూ.1,46,170 రూ.1,33,990 రూ.1,09,630
వరంగల్ రూ.1,46,170 రూ.1,33,990 రూ.1,09,630
ఏపీలోని ప్రధాన నగరాల్లో 10 గ్రాముల బంగారం ధరలు
విజయవాడ రూ.1,46,170 రూ.1,33,990 రూ.1,09,630
విశాఖపట్నం రూ.1,46,170 రూ.1,33,990 రూ.1,09,630
గుంటూరు రూ.1,46,170 రూ.1,33,990 రూ.1,09,630
నెల్లూరు రూ.1,46,170 రూ.1,33,990 రూ.1,09,630
తిరుపతి రూ.1,46,170 రూ.1,33,990 రూ.1,09,630
దేశంలోని ప్రధాన నగరాల్లో 10 గ్రాముల బంగారం ధరలు
చెన్నై రూ.1,47,290 రూ.1,35,010 రూ.1,13,160
ముంబై రూ.1,46,170 రూ.1,33,990 రూ.1,09,630
ఢిల్లీ రూ.1,46,320 రూ.1,34,140 రూ.1,09,780
కోల్‌కతా రూ.1,46,170 రూ.1,33,990 రూ.1,09,630
అహ్మదాబాద్ రూ.1,46,220 రూ.1,34,040 రూ.1,09,680
కేరళం రూ.1,46,170 రూ.1,33,990 రూ.1,09,630
Rahul N

Recent Posts