Download App

ట్రంప్ నిషేధాజ్ఞలు ఎలా ఉన్నాయంటే…

డిసెంబర్ 3, 2025 By Srinivas
"ఉపస్థి మినహా కన్యాదానం" అనే సామెత ఇప్పుడు కరెక్టుగా అమెరికా కు అన్వయించి చెప్పవచ్చు. అమెరికా వెళ్లడం చదువుకునే వాళ్ళకి, ఉద్యోగార్థం చదువు కున్న వాళ్ళకి ఒక కల…. మన దేశం లోనే కాదు… ప్రపంచంలో ఎక్కువ శాతం ఇలాగే ఉండేవారు…. ఇప్పుడు పరిస్థితి మారుతుంది. ట్రంప్ వచ్చాక…....
ట్రంప్ నిషేధాజ్ఞలు ఎలా ఉన్నాయంటే...

“ఉపస్థి మినహా కన్యాదానం” అనే సామెత ఇప్పుడు కరెక్టుగా అమెరికా కు అన్వయించి చెప్పవచ్చు. అమెరికా వెళ్లడం చదువుకునే వాళ్ళకి, ఉద్యోగార్థం చదువు కున్న వాళ్ళకి ఒక కల…. మన దేశం లోనే కాదు… ప్రపంచంలో ఎక్కువ శాతం ఇలాగే ఉండేవారు….

ఇప్పుడు పరిస్థితి మారుతుంది. ట్రంప్ వచ్చాక…. ఏదో చేద్దామనే ఆయన తపన ప్రతిచోట బెడిసికొడుతుంది. మనదేశం మీద విధించిన టారిఫ్ ల ఫలితంగా భారత దేశం కొత్తమార్కెట్ లను వెదికి exports ని ఇతర దేశాలకు పెంచుకుని అమెరికా కు తగ్గించుకుంది . దీని ఫలితంగా మన జీడీపీ ఈ త్రైమాసికంలో 8.2 % వెళ్ళింది అని మన ప్రభుత్వ వర్గాలు తెలుపుతున్నాయి. భారత దేశం ఎవ్వరూ ఊహించని విధంగా పురోగతి సాధిస్తుంది.

ఇక అమెరికా విషయానికి వద్దాం:

మొన్న ఒక ఆఫ్ఘన్ జాతీయుడు ఇద్దరు నేషనల్ గార్డ్స్ పై కాల్పులు జరిపాడు… ఈ సంఘటన లో ఒక మహిళ మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. దీనిని ఒక అవకాశం గా తీసుకుని ట్రంప్ కొన్ని దేశాల మీద నిషేధం విధించారు. కాని అందులో మత మౌఢ్యం నరనరాన జీర్ణించుకుని…. ప్రపంచ ఉగ్రవాదులు కు నిలయమైన పాకిస్తాన్ ని వదిలేశారు.

సెప్టెంబర్ 11, 2001, ఆల్-ఖైదా ఉగ్రవాదులు రెండు విమానాలతో వరల్డ్ ట్రేడ్ సెంటర్‌ని కూల్చివేశారు. ఇది అమెరికా చరిత్రలో అత్యంత చీకటి రోజు… దీని సూత్రధారి ఒసామా బిన్ లాడెన్ పాకిస్తాన్ లోనే ఉండటం…. అతని ని అమెరికా సైన్యం పాకిస్తాన్ లోనే పట్టుకుని హతమార్చడం…. జగద్వితమే…. అయినప్పటికీ ఈ నిషేధం విధించిన జాబితా లో పాకిస్థాన్ లేకపోవడం అమెరికా రెండు నాల్కల దోరణి కి నిదర్శనం.

అమెరికా ని మళ్ళీ గొప్ప దేశం గా తీర్చిదిద్దడం(Make america great again) అనే నినాదం తో గెలిచిన అమెరికా అధ్యక్షుడు దీనిని ఎలా సమర్థించుకుంటారో….. రమారమి 3000 వేల మంది చనిపోయారు. అందుకు ప్రధాన కారణం ఆల్ ఖైదా ముష్కరులు… వారికి అనధికార ఆశ్రయం కల్పించింది పాకిస్తాన్. దానిని వదిలేసి చిత్తశుద్ధి లేకుండా…. ఇతర దేశాలపై నిషేధం విధించింది.

అమెరికా నిషేధించిన జాబితాలో అఫ్గానిస్తాన్, మియన్మార్, చాద్, రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఈక్వటోరియల్ గినియా, ఎరిత్రియా, హైతీ, ఇరాన్, లిబియా, సోమాలియా, సూడాన్, యెమెన్ దేశాలు ఉన్నాయి.

మరో ఏడు దేశాలపై కూడా పాక్షికంగా నిషేధం విధించారు. బురుండి, క్యూబా, లావోస్, సియెర్రా లియోన్, టోగో, తుర్క్‌మెనిస్తాన్, వెనిజ్వెలా దేశాలకు చెందిన పౌరుల అమెరికా రాకపోకలపై పాక్షిక నిషేధం విధించింది. దీనిని సోషల్ మీడియా వేదికగా అందరూ…. తూర్పారబడుతున్నారు.

నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అన్నట్టుగా ఉంది… అమెరికా పోకడ…..

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.

View all posts

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading