రాజ్యాధికారమే పరమావధిగా బ్రతికేవాళ్ళు చాలా మంది ఉంటారు…. కొంత మంది వారు చేసిన పనులు, సేవలు ద్వారా నాయకులుగా పరిఢవిల్లుతారు. కొంతమంది కులాల్ని రెచ్చగొట్టి ఆ ముసుగులో నాయకులు గా ఎదుగుతారు. అందులో చదువుకున్న వాళ్లు ఉంటున్నారు. చదువు కోని వాళ్ళు ఉంటున్నారు.
కాని IPS చదువుకుని రాజ్యాధికారం కోసం కులాల్ని రెచ్చగొట్టి, ఆ విద్వేషపు మంటల్లో చలి కాచుకుని తమ పనులు ఆ వెలుగు లో చక్కబెట్టుకోవాలని తలచేవాళ్ళని ఏమి అనాలి…. వీళ్లా దేశ సమైక్యతను, సార్వభౌమత్వాన్ని కాపాడేది…
కులంతోనే ఎన్టీఆర్ , పి వి నరసింహారావు,చెన్నారెడ్డి, టి. అంజయ్య….మొదలైన వాళ్లు రాజకీయాల్లో రాణించారా…..!
ప్రభుత్వం నుండి అనుమతి తీసుకోకుండా విదేశీ పర్యటనలకు వెళ్లిన కేసులో, అప్పటి ఎంపీ, ఇప్పటి డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు కేసులో నిందితుడుగా ఉన్న పి. వి సునీల్ కుమార్ IPS వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. అనకాపల్లి జిల్లా చోడవరంలో జరిగిన ఓ కార్యక్రమంలో కాపులు, దళితులు కలిసి పనిచేస్తే రాజ్యాధికారం సాధించవచ్చని ఆయన చేసిన ప్రసంగం ఈ దుమారానికి కారణం.
మీ కాపు నాయకుడిని ముఖ్యమంత్రిని చేసుకోండి, మా దళిత నాయకుడిని ఉప ముఖ్యమంత్రిని చేయండి. ఐదేళ్లపాటు ఉండే పదవి కావాలి. అని పబ్లిక్ గా సభలో ప్రసంగిస్తూ కాపులకు పిలుపు నివ్వడం బాగా చర్చనీయాంశమైంది.
ప్రభుత్వ సర్వీసులో ఉన్న అధికారి ఇలా రాజకీయ, కులపరమైన వ్యాఖ్యలు చేయడం అఖిల భారత సర్వీసుల (ప్రవర్తన) నియమావళిని స్పష్టంగా ఉల్లంఘించడమేనని కొంత మంది రిటైర్డ్ అధికారులు అభిప్రాయపడుతున్నారు.
ఎంత చదువు చదువుకున్నా….. ఈ కులతత్వ పోకడలు అన్ని కులాల్లోనూ జీర్ణించుకుపోయాయని… కుల సంబంధిత సభలకు గాని, కుల భోజనాలకు వెళ్లకుండా….వెళ్తే సర్వీసుల నుండి తొలగించే విధంగా నియమావళి ఉంటేనే మనకు సుపరిపాలన అందరికీ అందుతుంది… ఆ విధంగా అఖిల భారత సర్వీసు నిబంధనలను సవరించాలని నెటిజన్లు కోరుతున్నారు.
లేకపోతే కులవ్యవస్థ తగ్గాల్సింది పోయి.. ఇటువంటి అధికారుల మూలంగా కుల జాడ్యం ముందు ముందు పెకలించలేని స్థాయిలో వెళ్ళూనుకుపోతుంది అంటున్నారు… దీనిపై కేంద్రం దృష్టి పెట్టీ కఠిన నిర్ణయాలు తీసుకోవాలని నేటి భావి భారత నెటిజన్లు….. కోరుకుంటున్నారు.