
ప్రపంచంలో రెండు న్యాయల గురించి చెబుతారు…. మార్జాల న్యాయం, మర్కట న్యాయం …. అంటే వివరిస్తాను.
పిల్లి తన పిల్లలని తనే నోట కరచుకుని ఒక చోట నుండి ఇంకో చోటు కి మారుస్తుంది…. అదే పిల్లి పిల్లని నోట కరచుకుని తీసుకుపోయేటప్పుడు ఏదైనా పొరపాటు జరిగితే అక్కడ తల్లి దే తప్పు అవుతుంది. మర్కట న్యాయం అంటే తల్లి కోతి చెట్టునుండి మరొక చెట్టు మీదకి దూకుతూ పోతూ ఉంటే కోతి పిల్ల తల్లిని కరచుకుని పట్టుకోవడం లో తేడా వచ్చి ఆ పిల్ల చనిపోతే తల్లి ఖాతా లో వేయడట యమ ధర్మరాజు…. ఇక్కడ ధర్మా ధర్మ విచక్షణ కలిగి తీర్పుని ఇస్తాడు సమవర్తి .
ఏమిటి ఈ చట్టం , న్యాయం దీనికి హిడ్మా కి సంబంధం ఏమిటి అనుకుంటున్నారా…..! గిరిజనులకు, బడుగు , బలహీన వర్గాలకు బాసట గా నిలిచి న్యాయం చేస్తున్నాము అనుకుంటున్నది నక్సలిజం …..
సంక్షేమ పథకాల ద్వారా, రిజర్వేషన్ల ద్వారా గిరిజన, బడుగు, బలహీన వర్గాలకు ధర్మబద్ధం గా చట్టాలు చేసి పాలిస్తున్నాం అంటుంది రాజ్యాంగ బద్ధమైన ప్రభుత్వం.
దీనికి తనదైన పంథాలో ఆ రోజుల్లో ఆవేశపూరితమైన ఆలోచనలతో హిడ్మా వంటి వారు మావోయిస్టులుగా మారి జీవితాలను ఫణంగా పెట్టి అసువుల బాసిన వారు ఎందరో…. వీరి పట్ల భయంతో కొంత మార్పు వచ్చి ఉండొచ్చు…. పూర్తిగా సమాజాన్ని మార్చడంలో ఎంతవరకు సఫలీకృతులు అయ్యారు అంటే మిలియన్ డాలర్ల ప్రశ్న…?
ఇది నాణెమునకు ఒకవైపు…. వీరి చర్యల వల్ల గెరిల్లా దళాల పోరాటం వల్ల ఎందరో పోలీసులు బలిదానం కావలసి వచ్చింది. వందల మంది సీఆర్పీఎఫ్ దళాల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు అసువులు బాసినరు తప్పితే ఒకరిమీద ఒకరికి పగ , ద్వేషం లేకుండా ఒకరినొకరు చంపుకున్నారు.
నక్సలిజం ని సపోర్ట్ చేస్తూ వారికి అండగా నిలిచిన సోషలిస్ట్ నాయకుల పిల్లలు ఎక్కువ శాతం విదేశాల్లో స్థిరపడటం ఏ విధమైన న్యాయం….. వాళ్ళు ఎలా సమర్థించుకుంటారో …. వాళ్ళ ఆత్మ సాక్షికే ఎరుక….
ఈ రోజుల్లో టెలి కమ్యూనికేషన్, శాటిలైట్, డ్రోన్, ఏఐ…. తదితర టెక్నాలజీ బాగా డెవలప్ కావడం తో నైట్ విజన్ గాగుల్స్ తో కూడిన దళాలు పకడ్బందిగా ఏరి వేస్తున్నారు…. భరతమాత ముద్దు బిడ్డలే రెండు వైపులా నేల కొరిగిపోయారు…..
అటవీ సంపదను… ఉదా : – మైనింగ్….. దోచుకోవడానికి ఈ కగార్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు అని సోషల్ మీడియా లో ఒక వర్గం వాదిస్తుంది. ఈ నక్సలిజం వల్ల పర్యావరణం కాపాడ బడుతున్నది అని అంటుంది ఈ వర్గం…. చైనా , రష్యా లలో జరుగుతున్నది ఇదే కదా అంటే సమాధానం లేదు….
వనరులు ఉపయోగించుకుంటూ, పారిశ్రామీకరణ కూడా జరుగుతుంటే దేశం అభివృద్ధి చెందుతుంది. అదే సమయంలో గిరిజనులకు కూడా అందులో భాగస్వామ్యులను చేస్తే అభివృద్ధి ఫలాలు అందరికీ అందుతాయి. సమసమాజ స్థాపనకు వీలు కలుగుతుంది. అన్ని ప్రయివేటు పరం చేయకుండా ప్రభుత్వ రంగ సంస్థలు ఏర్పాటు చేస్తే బాగుంటుంది అని నెటిజన్లు ఒక వర్గం వారు వాదిస్తున్నారు.
ఈ హిడ్మా తలపై రమారమి ఒక కోటి ఎనభై లక్షల రూపాయల రివార్డ్ ఉన్నది…. నాలుగైదు రాష్ట్రాల నుండి… ఇంచు మించు గా రెండువందలమంది చనిపోవడానికి….ప్రత్యక్షంగా కాని పరోక్షంగా కాని కారకుడు….
ఏది ఏమైనా ఈ హిడ్మా దంపతులు, టెక్ శంకర్ ఉదంతం తరువాత అయినా…. పౌర హక్కుల మేధావులు, సోషలిస్ట్ నాయకులు వాళ్ళ కి వీళ్ళకి మధ్యవర్తిత్వం జరిపి రెండు వైపులా మారణ హోమం జరగకుండా ఆపితే బాగుంటుంది అని అన్ని వర్గాల కోరిక….
కొసమెరుపు: ఈ పోరాటం ఈ రోజుల్లో అడవిలో కూర్చుని చేస్తుంటే ప్రాణాలు పోతాయి తప్ప సాధించేది శూన్యం…. జనజీవన స్రవంతిలోకి వచ్చి పోరాడాలి. అందరికీ న్యాయం జరిగేలా చూడాలి….
