ప్రస్తుతం వ్యక్తి పూజ భగవంతుడ్ని మించి జరుగుతుంది… అది కూడా భారతీయ హిందువులలో ఎందుకు అంటే “ఆశ” తప్పు లేదు…. ఆశ ఉంటుంది, ఉండాలి కూడా మనిషిగా పుట్టాము గనక…. కానీ అత్యాశ మరీ ప్రమాదం… ఒకడు అన్యాయం గా, అవినీతి , లంచగొండితనం తో సంపాదిస్తే వాడిని చట్టం, న్యాయం ఏమి చేయకపోతే మిగతా వాళ్ళకి వాడు ఆదర్శప్రాయుడు అవుతాడు…. ప్రస్తుతం భారతదేశం లో జరుగుతుంది అదే…. ఇది ఎక్కడి వరకు వెళుతుంది అంటే మనం ఏమి చేసినా పరవాలేదు…. చట్ట ప్రకారం మనకు ఏమి జరగదు… న్యాయ వ్యవస్థలో లోపాలతో 20 సం.. 30 సం… వరకు డోకా లేదు అని ఎప్పుడైతే మనిషి అనుకుంటాడో… అప్పుడు చట్టం మీద కాని ప్రభుత్వం మీద కానీ అతనికి , భయం కాని గౌరవం కాని ఏముంటుంది.
హిందూ సనాతన ధర్మం తన తో పాటు గా పక్కవారి ఆకలి కూడా తీర్చమని చెబుతున్నది.
మన రాజకీయ వ్యవస్థ లో లోపాల మూలంగా రాజకీయ నాయకులే చట్టాలను వాళ్ళకి అనుకూలం గా మార్చుకుంటూ పోతే…. ముందు ముందు మనిషి ని మనిషే కొట్టుకుతినే పరిస్థితి వస్తుంది అంటున్నారు… కొంతమంది నెటిజనులు.
ఇది ఎందుకు చెప్పాల్సివస్తుంది అంటే…. శబరిమల కు వెళ్ళిన అయ్యప్ప భక్తులు స్వామి వారి మీద భక్తి తో వెళుతున్నారా..! లేక తమ రాజకీయ నాయకులు లేక సినిమా హీరోల పోస్టర్లను ప్రదర్శించడానికి వెళుతున్నారో అర్ధం కావడం లేదు. ఈ పైత్యం ఇక్కడితో ఆగితే బాగుంటుంది లేదా… శరణు ఘోష వరకు వెళుతుందా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
పోనీ ఆయా రాజకీయనాయకులు , సినిమా హీరోలు వీటిని ఖండించడం లేదు. పైగా వాళ్ళు లోపల ఆనందిస్తున్నారో…. ఏమో తెలియడం లేదు…. దీనిని ప్రవచన కారులు గాని, సనాతన హైందవ వీరులు గాని అడ్డుకోకపోతే మరింత పెచ్చరిల్లే అవకాశం ఉంది.