Download App

“బత్తాయిల్ని క్షమించేదే లేదు.. ఎవ్వర్నీ వదలను… నరకం చూపిస్తా..” – యూట్యూబర్ అన్వేష్ హాట్ కామెంట్స్

ఫిబ్రవరి 20, 2026 By Srinivas
యూట్యూబర్ అన్వేష్ పై దేశం, హిందూ మతాన్ని మరియు దేవుళ్లను కించపరిచే విధంగా, అవమానకరమైన వ్యాఖ్యలతో బాటు మత విద్వేషాలు రెచ్చగొట్టేలా సోషల్ మీడియాలో పోస్టులు చేశారనే ఆరోపణలపై హైదరాబాద్ CCS పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై అందిన లేఖతో ఇన్‌స్టాగ్రామ్ అన్వేష్...
“బత్తాయిల్ని క్షమించేదే లేదు.. ఎవరినీ వదలను… నరకం చూపిస్తా..” – యూట్యూబర్ అన్వేష్ హాట్ కామెంట్స్

యూట్యూబర్ అన్వేష్ పై దేశం, హిందూ మతాన్ని మరియు దేవుళ్లను కించపరిచే విధంగా, అవమానకరమైన వ్యాఖ్యలతో బాటు మత విద్వేషాలు రెచ్చగొట్టేలా సోషల్ మీడియాలో పోస్టులు చేశారనే ఆరోపణలపై హైదరాబాద్ CCS పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై అందిన లేఖతో ఇన్‌స్టాగ్రామ్ అన్వేష్ ఖాతాను నిలుపుదల చేసింది.

అయితే తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ రద్దు తర్వాత, అన్వేష్ ఒక వీడియో రిలీజ్ చేసారు. ఆ వీడియోలో చేసిన వ్యాఖ్యలు తాజాగా వైరల్‌గా మారాయి.

“నా ఇన్‌స్టాగ్రామ్ పోతే బాధపడతా అనుకున్నారా బత్తాయిలు?” అంటూ వ్యంగ్యంగా స్పందించిన అన్వేష్… రూపాయ్ రాని ఇన్‌స్టాగ్రామ్ నాకు ఉంటె ఎంత.. పోతే ఎంత.. నా ఈకతో సమానం అంటూ వ్యాఖ్యలు చేసారు.

“నా రెండు చేతులు నా రెండు ఇన్‌స్టాగ్రామ్లు… రెండు యూట్యూబ్ ఛానల్స్ నా రెండు కాళ్లు… నా ఫేస్‌బుక్ నా శరీరంలో ఒక భాగం… ఈ ఐదు భాగాల్ని నడిపించేది నా తెలివైన బుర్ర…” అంటూ ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఒక అకౌంట్ పోయినా మరొకటి ఉందని, ఒక ప్లాట్‌ఫామ్ తీసేసినా మిగిలిన సోషల్ మీడియా వేదికలతో ముందుకు వెళ్తానని ఆయన పేర్కొన్నారు. “చివరికి నా తలతో అయినా మాట్లాడి ముందుకు వెళ్తాను… నేను దొరికితే తీయాల్సింది మొదటగా తీయాల్సింది తల” అంటూ తన గాంభీర్యాన్ని ప్రదర్శించారు.

“నేను ఎవర్నీ దేకను… ఎలాంటి మోసాలు చేయలేదు… ఫాలోవర్స్ ఉంటే ఏంటి, పోతే ఏంటి?” అని ప్రశ్నిస్తూ, తాను ఎలాంటి తప్పు చేయలేదని స్పష్టం చేశారు.

అంతేకాకుండా, “2026లో బత్తాయిల్ని క్షమించేదే లేదు.. మీకు నిద్ర పట్టదు… ఎవరినీ వదలను… నరకం చూపిస్తా..” అంటూ హెచ్చరించారు.

అన్వేష్ చేసిన ఈ ఘాటైన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తున్నాయి.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.

View all posts

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading