Download App

ఆపరేషన్ కగార్ తో… ఆపరేషన్ ముక్త్ భారత్…

మార్చి 31, 2026 • By Suresh Thota
"ఆపరేషన్ కగార్" (Operation Kagar) ద్వారా దేశంలో, ముఖ్యంగా ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ప్రాంతంలో, మావోయిస్టు తీవ్రవాదాన్ని దాదాపు నిర్మూలించామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. 2026 మార్చి 31 నాటికి మావోయిస్టు రహిత భారత్‌ను సాధించాలనే లక్ష్యానికి ఇది చివరి దశ అని, మిగిలిన మావోయిస్టులు...
ఆపరేషన్ కగార్ తో… ఆపరేషన్ ముక్త్ భారత్…

“ఆపరేషన్ కగార్” (Operation Kagar) ద్వారా దేశంలో, ముఖ్యంగా ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ప్రాంతంలో, మావోయిస్టు తీవ్రవాదాన్ని దాదాపు నిర్మూలించామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. 2026 మార్చి 31 నాటికి మావోయిస్టు రహిత భారత్‌ను సాధించాలనే లక్ష్యానికి ఇది చివరి దశ అని, మిగిలిన మావోయిస్టులు ఆయుధాలు వీడి ప్రధాన స్రవంతిలోకి రావాలని ఆయన పిలుపునిచ్చారు.

ఆపరేషన్ కగార్ కౌంట్‌డౌన్ ముగింపులో ఉందని, మావోయిస్టులు లొంగిపోకపోతే కఠిన చర్యలు తప్పవని అమిత్ షా స్పష్టం చేశారు. ఛత్తీస్‌గఢ్, బస్తర్ ప్రాంతంలో మావోయిస్టులు అత్యంత బలహీనపడ్డారని, వారి నెట్‌వర్క్ దాదాపుగా కూలిపోయిందని ఆయన పేర్కొన్నారు. మావోయిస్టుల హింస తగ్గి, ఆ ప్రాంతంలో భద్రతా బలగాలు పట్టు సాధించడంతో అభివృద్ధి పనులు వేగవంతమయ్యాయని తెలిపారు. 2024 చివరలో ప్రారంభమైన ఈ ఆపరేషన్, అబూజ్‌మాడ్ (Abujhmad) ప్రాంతంపై ప్రత్యేక దృష్టి సారించి కీలక నాయకులను, మావోయిస్టులను ఏరివేసిందని వివరించారు. ఈ ఆపరేషన్ ద్వారా మావోయిస్టు హింసకు శాశ్వత ముగింపు పలకడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని ఉద్ఘాటించారు.

భారత ప్రభుత్వం 2024 చివర్లో ప్రారంభించిన ఈ ఆపరేషన్ కగార్, 2026 మార్చి 31 డెడ్‌లైన్ ప్రకటించింది. నక్సలిజాన్ని దాదాపు అంతం చేసింది. 540 మంది మావోయిస్టులు ఎన్‌కౌంటర్‌లలో హతమవగా, 300 పైగా లొంగిపోయారు. నక్సల్ ప్రభావిత జిల్లాలు 125 నుంచి 7 కి తగ్గాయి. అమిత్ షా “బస్తర్‌లో నక్సలిజం దాదాపు అంతమైంది” అని పార్లమెంట్ లో ప్రకటించారు.

2024లో ప్రారంభమైన ఈ ఆపరేషన్ CRPF, COBRA, DRG బలగాలు తో రమారమి లక్ష మందిని మోహరించి, డ్రోన్లు, AI, సాటిలైట్ ఇంటెలిజెన్స్ తో పాటు అత్యున్నత స్థాయిలో టెక్నాలజీ ను ఉపయోగించింది. లోక్‌సభలో అమిత్ షా మాట్లాడుతూ, ఛత్తీస్‌గఢ్‌లో నక్సలిజం దాదాపు గా ముగిసింది, 7 జిల్లాల్లో పాక్షిక ప్రభావం ఉంది. ఎన్‌డీఏ పాలనలో ఆదివాసీ సంక్షేమం పెరిగిందని చెప్పారు.

ఆపరేషన్ కగార్ తో… ఆపరేషన్ ముక్త్ భారత్…

బస్తర్, అబూజ్‌మాడ్, దండకారణ్యం, సుక్మా లలో…. “తెలంగాణ” లోని…. భద్రాద్రి కొత్తగూడెం, కర్రెగుట్ట లలో.. “ఆంధ్రప్రదేశ్” లోని అల్లూరి సీతారామరాజు జిల్లా లో…. “మహారాష్ట్ర” లోని “గఢ్చిరోలి”, “ఒడిశా”లోని “మల్కాన్ గిరి” మొదలగు జిల్లాలలో ఒక్క సంవత్సరంలో 500 పైగా ఎన్‌కౌంటర్లు కాగా, సుమారుగా 540 మంది నిహతులు అయ్యారు. భద్రతా సిబ్బంది మరణాలు 30 వరకు చనిపోయారు.

ఈ కగార్ ఆపరేషన్ పోరాటానికి 2024-26లో రూ. ఇంచు మించుగా 8,000 కోట్లు ఖర్చు అయినట్లుగా ఒక అంచనా, భద్రతా బలగాలు ఖర్చు కాకుండా 20% సాంకేతికత డ్రోన్లు, AI మొదలగునవి. 20% మౌలిక సదుపాయాలకు ఖర్చు అయినట్లుగా తెలుస్తుంది.

నక్సల్ జిల్లాలు 38 నుంచి బాగా తగ్గాయి. 1,457 మంది లొంగిపోయారు, 1,500 వరకుఅయ్యారు. బస్తర్ జిల్లాలో కమ్యూనికేషన్ టవర్లు. అబూజ్‌మాడ్‌లో రోడ్లు, వంతెనలు వేగంగా నిర్మాణమవుతున్నాయి. ఆదివాసీలకు స్కూళ్లు, ఆసుపత్రులు, ప్రభుత్వ పథకాలు చేరువ అవుతున్నాయి.

మిగిలిన నక్సల్ బలాలు కలిగిన ప్రాంతాలు

అబూజ్‌మాడ్, కర్రెగుట్టలు ప్రధాన కేంద్రాలు కాగా, గఢ్చిరోలి, మాలకాంగిరి లలో చిన్న, చిన్న ప్రాంతాల్లో, అంటే పాక్షికంగా 7 జిల్లాల లో నక్సలిజం ప్రభావం ఉంది. వీటి పైన డీజీపీ సమీక్ష లో ఫినిషింగ్ ఆపరేషన్లు ప్రారంభం అవుతాయి అని అంటున్నారు .

బస్తర్ డివిజనల్ కమిటీ సెక్రటరీ మావోయిస్ట్ అగ్ర నేత “హిడ్మా” (రూ. 1 కోటి రివార్డ్) 2025 నవంబర్ 18 న మారేడుమిల్లి ఎన్‌కౌంటర్‌లో చనిపోయాడు. 2010 సుక్మా, 2013 జీరం ఘాట్ దాడులకు ఇతను వ్యూహకర్త. ఇంకా దండకారణ్య స్పెషల్ జోన్ నేతలు. ఆశన్న, శ్యామ్ దాదా, డెవ్‌జీ, వికాస్ వంటి వారు లొంగిపోయారు. లొంగిపోయిన వారికి రివార్డ్ లతో పాటు, ఉపాధి, హెల్త్ ఇన్సూరెన్స్ ఇచ్చి వారిని సాదరంగా జన జీవన స్రవంతి లోకి ఆహ్వానిస్తున్నారు.

ఇంటెలిజెన్స్ ఆపరేషన్లు తో పాటు,ప్రజా సహకారం కూడా తగ్గిపోయింది. ఆదివాసీలకు సంక్షేమ పథకాలు అందించడం తో వారి మద్దతు మావోయిస్టులకు తగ్గిపోయింది. వారు మద్దతు తగ్గించారు.

కేంద్ర ప్రభుత్వ వ్యూహాలతో 2026 చివరికి “ఆపరేషన్ ముక్త్ భారత్” సాధ్యమే అనిపిస్తుంది. ప్రభుత్వం నకు చిత్త శుద్ధి ఉండాలి కాని ఏదైనా సాధ్యమే అంటున్నారు. సోషల్ మీడియాలో నెటిజన్లు.

Suresh Thota

సురేష్ తోట ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్. సినిమా, రాజకీయాలు మరియు సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక వ్యాసాలు రచించడం ఆయన ప్రత్యేకత. సమకాలీన పరిణామాలపై లోతైన అవగాహనతో, వాస్తవాధారిత దృక్కోణంలో పాఠకులకు స్పష్టమైన, సమగ్ర సమాచారాన్ని అందించడం ఆయన రచనా శైలిలో ప్రధాన లక్షణం.

View all posts

Trending Now

No trending articles in this category from the last 3 days.

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading