కల్ట్ మూవీ రివ్యూ
Published అక్టోబర్ 30, 2026 by Srinivas
మాస్ కా దాస్ విశ్వక్ సేన్‌ను ప్రస్తుతం హిట్ అనేది చాలా ఇంపార్టెంట్. గతేడాది ఆయన నటించిన ‘లైలా’ చిత్రం వచ్చేసి డిజాస్టర్. అంతకు ముందు చిత్రాలు సైతం ఆశించిన ఫలితాన్నివ్వలేదు. దీంతో ఇప్పుడు ఆయనకు సక్సెస్ చాలా కీలకంగా మారింది. ఈ క్రమంలోనే విశ్వక్‌సేన్ నేడు డార్క్ థ్రిల్లర్ సినిమా ‘కల్ట్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా నుంచి తాజాగా వచ్చిన ట్రైలర్ అయితే బాగానే ఆకట్టుకుంది. మరి సినిమా ఎలా ఉంది? తెలుసుకుందాం.

కథేంటంటే…
హైదరాబాద్‌కు చెందిన ముగ్గురు కుర్రాళ్లు ఎంజాయ్ చేద్దామని గోవాకు వెళతారు. గోవాలో హోంమంత్రి కొడుకు ఎల్విన్(తారక్ పొన్నప్ప).. నాలుగేళ్లకొకసారి వచ్చే తన పుట్టినరోజుని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాడు. ఈ క్రమంలోనే అతని పుట్టినరోజు వచ్చింది. దీనికి #కల్ట్ అనే పబ్‌ను వేదికగా చేసుకుని.. తన బర్త్‌డే పార్టీకి వచ్చే వారి కోసం కొన్ని పాసులను జారీ చేస్తాడు. అనుకోకుండా ఆ పాస్‌లను ఆ ముగ్గురు కుర్రాళ్లు సంపాదించి పార్టీకి వెళతారు. అక్కడ సరికొత్త వాతావరణం కనిపించడంతో ఎంజాయ్ చేస్తుంటారు. దాదాపు 300 మంది ఆ పార్టీకి అటెండ్ అవుతారు. పార్టీ ప్రారంభమైన కొంతసేపటి వరకు బాగానే ఉంటుంది గానీ తర్వాత పరిస్థితులు దారుణంగా తయారవుతాయి. ఆ పబ్‌కు లాక్ చేసి బాంబులు అమరుస్తారు. లోపల స్క్రీన్‌పై ఓ బొమ్మ కనిపిస్తుంది. ఆ బొమ్మ మ్యూజిక్ ప్లే చేసినప్పుడు కొన్ని గేమ్స్ పెడుతుంది. దానిలో ఓడిపోయిన వాళ్లని నిర్ధ్యాక్షిణంగా చంపడం మొదలుపెడుతుంది. అసలు వీళ్లను చంపుతున్నదెవరు? అక్కడ ఏం జరుగుతోంది? పబ్‌లోకి డీఎస్పీ సంకల్ప్ నాయక్ (విశ్వక్ సేన్) వెళ్లి ఏం చేశాడు? చివరకు కథ ఎలాంటి మలుపు తీసుకుంది? అనేది ఈ సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

ఎలా ఉందంటే…
కొరియన్ డ్రామా ‘స్క్విడ్ గేమ్’ వెబ్ సిరీస్ ఇప్పటికే చాలా మంది చూసేశారు. ఇది చూసిన వారికి సినిమా యాజ్ ఇట్ ఈజ్ ఉందని అనిపిస్తుంది. సేమ్ స్క్విడ్ గేమ్‌లో మాదిరిగానే బొమ్మ టాస్క్‌లు ఇస్తుంది. ఓడిన వారిని చంపేస్తుంటారు. వాస్తవానికి ఈ సినిమా ట్రైలర్ వచ్చినప్పుడే స్క్విడ్ గేమ్‌లా ఉందని అందరూ భావించారు. సినిమా చూసిన తర్వాత దానికి భిన్నంగా ఏమీ అనిపించదు. కాకపోతే క్లైమాక్స్‌ను భిన్నంగా ప్లాన్ చేశారు. సినిమా ప్రారంభమైన దాదాపు గంట సేపటి వరకూ హీరో విశ్వక్‌సేన్ కనిపించడు. అసలు అంతా క్లోజ్‌డ్‌గా ఉన్న పబ్‌లోకి సంకల్ప్ ఎలా ప్రవేశించాడనేది అర్థం కాదు. దారుణమైన వైలెన్స్, బూతులు.. పిల్లలు, మహిళలు ఈ సినిమా చూడకపోవడమే బెటర్. వాస్తవానికి స్క్విడ్ గేమ్ సిరీస్‌కు ఒకట్రెండు ఎపిసోడ్స్ చూసిన వారు దీనిలో లీనమై పోతారు. కానీ ఈ సినిమా మాత్రం అలా లీనమవలేరు. ఏ పాత్రతోనూ సరిగా ట్రావెల్ చేయలేం. హీరోయిన్ పాత్ర ఉంది కానీ నటనకు ఏమాత్రం స్కోప్ లేదు. కథలోకి డీఎస్పీ సంకల్ప్ నాయక్ పాత్ర ఎంటర్ అవుతుందో అప్పటి నుంచి స్టోరీలో సంఘర్షణ మొదలవుతుంది. కానీ సంకల్ప్ ఎంట్రీ ఇచ్చిన కాసేపటికే ఇంటర్వెల్ వస్తుంది. క్లైమాక్స్‌లో వచ్చే విలన్ ఫ్లాష్ బ్యాక్ కొత్తగా ఏమీ అనిపించదు. మొత్తంగా ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించడం చాలా కష్టం.
ఎవరెలా నటించారంటే…
విశ్వక్‌సేన్.. సంకల్ప్‌గా బాగానే నటించాడు. ఎల్విన్‌గా తారక్ పొన్నప్ప అద్భుతంగా నటించాడు. గాయత్రి భరద్వాజ్ అందంగా కనిపించింది కానీ ఆమెకు నటనకు ప్రాధాన్యత లేని పాత్ర. ముగ్గురు కుర్రాళ్లు బాగానే సందడి చేశారు. మిగిలిన పాత్రలన్నీ తమ పాత్ర పరిధి మేరకు చక్కగా నటించారు.

టెక్నికల్ పరంగా..
ముందుగా విశ్వక్‌సేన్ డైరెక్షన్ గురించి మాట్లాడాలి. విపరీతమైన వైలెన్స్.. బూతులతో సినిమాను నడిపించారు. సినిమా చూస్తుంటే స్క్విడ్ గేమ్ చూస్తున్నట్టుగానే అనిపిస్తుంది. ఏమాత్రం కొత్తగా అనిపించలేదు. ఇక బీజీఎం సినిమాకు ప్లస్ అయ్యింది. సినిమా సాగదీతగా అనిపిస్తుంది. నిర్మాణ విలువలు పర్వాలేదనిపించాయి.
ఫైనల్‌గా..
కల్ట్ మూవీ ప్రేక్షకులకు ఏమాత్రం కనెక్ట్ అవదు.
Rating: 



(2/5)
