Download App

‘గాంధారి’ ఓటీటీ ఎంట్రీ.. తాప్సీ యాక్షన్ అవతార్ ఎలా ఉందంటే?

సెప్టెంబర్ 3, 2026 By Srinivas
తాప్సీ పన్ను మరోసారి పవర్‌ఫుల్ యాక్షన్ పాత్రతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆమె ప్రధాన పాత్రలో నటించిన ‘గాంధారి’ నేడు నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వచ్చింది. దేవాశిష్ మఖిజా దర్శకత్వంలో, కనికా ధిల్లాన్ రచనలో తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్‌పై ఇప్పటికే ఆసక్తి నెలకొంది. సెప్టెంబర్ 3న సినిమా...
‘గాంధారి’ ఓటీటీ ఎంట్రీ.. తాప్సీ యాక్షన్ అవతార్ ఎలా ఉందంటే?

తాప్సీ పన్ను మరోసారి పవర్‌ఫుల్ యాక్షన్ పాత్రతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆమె ప్రధాన పాత్రలో నటించిన ‘గాంధారి’ నేడు నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వచ్చింది. దేవాశిష్ మఖిజా దర్శకత్వంలో, కనికా ధిల్లాన్ రచనలో తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్‌పై ఇప్పటికే ఆసక్తి నెలకొంది.

సెప్టెంబర్ 3న సినిమా ఓటీటీలోకి వస్తుందని ప్రకటించడంతో చాలామంది అర్ధరాత్రి 12 గంటలకే స్ట్రీమింగ్ మొదలవుతుందని భావించారు. అయితే ‘గాంధారి’ విషయంలో మేకర్స్ కాస్త భిన్నమైన టైమింగ్‌ను ఫిక్స్ చేశారు. ఈ సినిమా మధ్యాహ్నం 12:30 గంటల నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

కూతురి కోసం తల్లి రివెంజ్ జర్నీ!

‘గాంధారి’లో తాప్సీ బాణి అనే తల్లి పాత్రలో కనిపిస్తారు. ఓ దారుణమైన దాడి తర్వాత ఆమె తాత్కాలికంగా చూపును కోల్పోతుంది. అదే సమయంలో ఆమె చిన్న కుమార్తె కిడ్నాప్‌కు గురవుతుంది.

కూతురిని తిరిగి తీసుకురావడానికి బాణి వెనక్కి తగ్గదు. తన బిడ్డను కిడ్నాప్ చేసిన ప్రమాదకరమైన హ్యూమన్ ట్రాఫికింగ్ సిండికేట్‌ను ఎదుర్కొనేందుకు తనను తాను సిద్ధం చేసుకుంటుంది. ఆ తర్వాత జరిగే పోరాటమే సినిమాకు ప్రధాన హైలైట్‌గా నిలవనుంది.

ఈ కథలో యాక్షన్‌తో పాటు తల్లి-కూతురు బంధం, ప్రతీకారం, భావోద్వేగాలకు కూడా ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తోంది.

బలమైన సపోర్టింగ్ కాస్ట్

తాప్సీతో పాటు ఇష్వాక్ సింగ్ కీలక పాత్రలో నటించారు. ఛాయా కదమ్, స్వస్తికా ముఖర్జీ, మితా వశిష్ట్, జతిన్ సర్నా తదితరులు ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు.

థియేట్రికల్ రిలీజ్‌కు వెళ్లకుండా నేరుగా ఓటీటీ బాట పట్టిన ‘గాంధారి’.. తాప్సీ యాక్షన్ అవతార్‌ను చూడాలనుకునే ప్రేక్షకులకు ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.

View all posts

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading