Download App

మార్చి 4 నుంచి ఓటిటీలోకి వస్తోన్న ‘ఓం శాంతి శాంతి శాంతిః’

ఫిబ్రవరి 24, 2026 By Srinivas
Tharun Bhascker, Eesha Rebba ప్రధాన పాత్రల్లో నటించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘ఓం శాంతి శాంతి శాంతిః’ కుటుంబ సంబంధాలు, భావోద్వేగాలు, సరళమైన వినోదాన్ని మేళవిస్తూ రూపొందిన చిత్రం. జనవరి 30న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా, తన కంటెంట్‌తో ఓ వర్గం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ చిత్రానికి...
మార్చి 4 నుంచి ఓటిటీలోకి వస్తోన్న ‘ఓం శాంతి శాంతి శాంతిః'

Tharun Bhascker, Eesha Rebba ప్రధాన పాత్రల్లో నటించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘ఓం శాంతి శాంతి శాంతిః’ కుటుంబ సంబంధాలు, భావోద్వేగాలు, సరళమైన వినోదాన్ని మేళవిస్తూ రూపొందిన చిత్రం. జనవరి 30న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా, తన కంటెంట్‌తో ఓ వర్గం ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఈ చిత్రానికి నూతన దర్శకుడు AR Sajeev దర్శకత్వం వహించారు. కుటుంబ నేపథ్యంలో నడిచే కథలో భావోద్వేగాలకు ప్రాధాన్యతనిస్తూ, సహజమైన సంభాషణలు, సున్నితమైన సన్నివేశాలతో కథను చెప్పే ప్రయత్నం చేశారు. తరుణ్ భాస్కర్ తన సహజ నటనతో పాత్రకు న్యాయం చేయగా, ఈషా రెబ్బా తన పాత్రలో సున్నితత్వాన్ని చక్కగా ప్రతిబింబించారు.

ఈ చిత్రాన్ని S Originals, Movie Verse Studios బ్యానర్లపై Srujan Yarabolu, Aditya Pitti, Vivek Krishnani, Anup Chandrasekharan, Sadiq Shaik, Naveen Sanivarapu నిర్మించగా, Kishore Jaladi, Bala Soumithri సహ నిర్మాతలుగా వ్యవహరించారు.

ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రానుంది. వైవిధ్యమైన కంటెంట్‌ను అందిస్తూ ముందుకు సాగుతున్న Aha లో ‘ఓం శాంతి శాంతి శాంతిః’ మార్చి 4వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి రానుంది. గోల్డ్ సబ్‌స్క్రైబర్లు 24 గంటల ముందుగానే ఈ చిత్రాన్ని వీక్షించే అవకాశం పొందనున్నారు.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.

View all posts

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading