Download App

ఓటీటీలోకి వచ్చేసిన తిరువీర్ ‘పాపం ప్రతాప్’

మే 7, 2026 By Srinivas
యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో తిరువీర్ ప్రధాన పాత్రలో, యువ నటి పాయల్ రాధాకృష్ణ హీరోయిన్‌గా దర్శకుడు ఎస్.పీ. దుర్గాప్రసాద్ తెరకెక్కించిన విలేజ్ డ్రామా 'పాపం ప్రతాప్' ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. వింతైన వ్యాధి ఉందనే కారణంతో పెళ్లైన కొద్ది రోజులకే భర్తను వదిలి వెళ్లిపోయే...
ఓటీటీలోకి వచ్చేసిన తిరువీర్ 'పాపం ప్రతాప్'

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో తిరువీర్ ప్రధాన పాత్రలో, యువ నటి పాయల్ రాధాకృష్ణ హీరోయిన్‌గా దర్శకుడు ఎస్.పీ. దుర్గాప్రసాద్ తెరకెక్కించిన విలేజ్ డ్రామా ‘పాపం ప్రతాప్’ ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది.

వింతైన వ్యాధి ఉందనే కారణంతో పెళ్లైన కొద్ది రోజులకే భర్తను వదిలి వెళ్లిపోయే భార్య… ఆమె వెళ్లిపోయిన తర్వాత ప్రతాప్ జీవితంలో ఎదురైన సమస్యలు… తిరిగి తన భార్యను ఎలా వెనక్కి తీసుకొచ్చుకున్నాడు అనే ఆసక్తికరమైన కథాంశంతో ఈ సినిమా రూపొందింది.

గ్రామీణ నేపథ్యంలో భావోద్వేగాలు, వినోదం కలిపి తెరకెక్కిన ఈ చిత్రం థియేటర్లలో ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయినా, ఇప్పుడు ఓటీటీలో కొత్త ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది.

ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ వేదిక ఈటీవీ విన్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక నేటి నుంచి “పాపం ప్రతాప్” స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వచ్చింది. థియేటర్లలో మిస్ అయిన ప్రేక్షకులు ఇప్పుడు ఇంటి వద్ద నుంచే ఈ సినిమాను వీక్షించవచ్చు.

ఇక ఈ చిత్రంలో అజయ్ ఘోష్ కీలక పాత్రలో నటించగా, క్రిష్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణ బాధ్యతలు చేపట్టింది.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.

View all posts

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading