
అనంతపురం జిల్లా, ఉరవకొండ నియోజకవర్గం, చాయాపురంలో హంద్రీనీవా సుజల స్రవంతి పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిశీలించారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.
హంద్రీనీవా పనులపై అధికారులు ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు. కిలోమీటరు మేర సాగుతున్న పనులను డ్రోన్ ద్వారా పరిశీలించారు. ప్రోగ్రామింగ్ ద్వారా రోజూ ఎంతమేర పనులు చేశారో డ్రోన్ ద్వారా పర్యవేక్షించాలని సూచించారు.

నాలుగు ఏజన్సీల ద్వారా పనులు జరుగుతున్నాయని ఈ సందర్భంగా అధికారులు సీఎంకు వివరించారు. ఇటీవల నాలుగుసార్లు వర్షాలు కురవడంతో పనులకు కొంతమేర ఆటంకం ఏర్పడిందని తెలుపగా… ఇకపై వేగంగా పనులు సాగించాలని సీఎం సూచించారు. నిర్దేశిత కాలానికి ఎట్టి పరిస్థితుల్లో పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
