Download App

రాయలసీమకు కృష్ణా జలాలు – మల్యాల పంపింగ్ స్టేషన్ నుంచి నీటిని విడుదల చేసిన సీఎం చంద్రబాబు

జూలై 18, 2025 • By Srinivas
రాయలసీమ రైతుల కళ్లలో ఆనందం కనిపించింది. నంద్యాల జిల్లా మల్యాల పంపింగ్ స్టేషన్‌లో హంద్రీ-నీవా ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణా జలాలను విడుదల చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా మోటార్లు ఆన్ చేశారు. రైతులతో కలిసి జలహారతి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ప్రజాప్రతినిధులు, స్థానిక రైతులు...
రాయలసీమకు కృష్ణా జలాలు – మల్యాల పంపింగ్ స్టేషన్ నుంచి నీటిని విడుదల చేసిన సీఎం చంద్రబాబు

రాయలసీమ రైతుల కళ్లలో ఆనందం కనిపించింది. నంద్యాల జిల్లా మల్యాల పంపింగ్ స్టేషన్‌లో హంద్రీ-నీవా ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణా జలాలను విడుదల చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా మోటార్లు ఆన్ చేశారు. రైతులతో కలిసి జలహారతి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ప్రజాప్రతినిధులు, స్థానిక రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ సందర్బంగా సీఎం మాట్లాడుతూ, శ్రీశైలం మల్లన్న దగ్గర ప్రారంభమైన నీళ్లు కలియుగ దైవం తిరుమల వెంకన్న వరకూ చేరేలా అనుసంధానాన్ని పూర్తిచేస్తామని, అది పూర్తయిన తర్వాతే జలహారతి ఇవ్వాలనే సంకల్పంతో ముందుకెళ్తున్నామన్నారు. ఇది కేవలం ప్రాజెక్ట్ కాదు — లక్షలాది మందికి జీవనాధారం అని ఆయన స్పష్టం చేశారు.

రాయలసీమకు కృష్ణా జలాలు – మల్యాల పంపింగ్ స్టేషన్ నుంచి నీటిని విడుదల చేసిన సీఎం చంద్రబాబు

విపక్షనేత వైఎస్ జగన్ పై చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. “క్లైమోర్ మైన్లు నన్నేం చేయలేక పోయాయి. నీ విమర్శలు, బూతులు నన్నేం తాకలేవు,” అని అన్నారు. గత ప్రభుత్వ పాలనపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, “నీ ఐదేళ్ల పాలనలో హంద్రీ-నీవాపై ఒక్క రూపాయి అయినా ఖర్చు పెట్టావా?” అంటూ జగన్‌ను ప్రశ్నించారు.

జగన్ హయాంలో కుప్పంలో సినిమా సెట్ వేశారని, కాల్వల్లో నీళ్లు లేకపోయినా ట్యాంకర్లతో నీళ్లు తెచ్చి డ్రామాలాడారని ఎద్దేవా చేశారు. “డమ్మీ గేట్లు పెట్టి నీళ్లు వచ్చాయన్నట్లు పబ్లిసిటీ ఇచ్చారు. ఇలాంటి డ్రామాలు ఇక మానుకోవాలి,” అని అన్నారు.

రాయలసీమకు కృష్ణా జలాలు – మల్యాల పంపింగ్ స్టేషన్ నుంచి నీటిని విడుదల చేసిన సీఎం చంద్రబాబు

ఇక విద్యా రంగాన్ని ప్రస్తావిస్తూ, “జగన్ పాలనలో టీచర్లు లేకుండా స్కూల్లు నడిపించారు. స్కూల్స్ ఉద్దరించేసామంటూ గొప్పగా చెప్పుకున్నారు. కానీ మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్సీ ప్రక్రియ ప్రారంభించాం,” అని తెలిపారు.

ఇప్పటి నుంచే చంద్రబాబు ప్రభుత్వం స్పష్టమైన ప్రణాళికలతో ముందుకు వెళ్తోంది. రైతుల మనసుల్లో నమ్మకం పెరుగుతోంది. ఈ కార్యక్రమం రాయలసీమకు కేవలం నీటి ప్రవాహాన్ని కాదు — ఆశ, భరోసాను కూడా తీసుకొచ్చింది.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.

View all posts

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading