ఆంధ్ర ప్రదేశ్

పవన్ కళ్యాణ్‌పై పేర్ని నాని ఫైర్

Published by
Srinivas

జనసేన అధినేత, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని విమర్శలు గుప్పించారు. ప్రధానంగా జల్ జీవన్ మిషన్ అంశంపై ఆయన ప్రశ్నల వర్షం కురిపించారు.

“ఆర్భాటంగా ప్రారంభించిన జల్ జీవన్ మిషన్‌లో సోర్సింగ్ కెపాసిటీ పెంచే చర్యలు తీసుకున్నారా పవన్ కళ్యాణ్ గారు? కొత్త చెరువులు తవ్వడం, బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు నిర్మించడం, సర్వీస్ రిజర్వాయర్లు మంజూరు చేయడం వంటివి ఏదైనా జరిగాయా? లేదంటే ఇప్పుడున్న మౌలిక సదుపాయాల నుంచే ఇంటింటికీ నీళ్లు ఇస్తామంటారా?” అని నాని నిలదీశారు.

వైస్ జగన్ ని అధికారంలోకి రానివ్వను అనడానికి మీరు ఎవరు?, ఏడాది కాలంగా డిప్యూటీ సీఎం పదవిలో ఉన్న మీరు ప్రజల కోసం ఏం చేశారని ప్రశ్నించారు. చంద్రబాబు కోసం మాత్రమే బయటికి వస్తున్నాడు. ఫ్యామిలీతో హెలికాప్టర్ ఎక్కి తిరగడం తప్ప రాష్ట్రానికి ఆయన చేసినది ఏమీ లేదు,” అని నిప్పులు చెరిగారు.

పవన్ కళ్యాణ్‌కు బుల్లెట్ ప్రూఫ్ కారు కావాలి కానీ, అదే సమయంలో మహిళల రక్షణ మాత్రం పట్టడం లేదంటూ ఆయన విమర్శించారు. పోలీసులను ప్రజల రక్షణకు కాకుండా, వైఎస్సార్‌సీపీ నేతలపై కక్ష సాధింపుకు వినియోగిస్తున్నారని ఆరోపించారు.

ప్రస్తుతం పేర్ని నాని వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.