తెలంగాణ

స్నేహితుల అవమానాలతో మనస్తాపం – బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య

Published by
Rahul N

స్నేహితుల అవమానిచారంటూ మనస్తాపానికి గురైన బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన జగిత్యాలలో జరిగింది.

వివరాల్లోకి వెళ్తే.. జగిత్యాల జిల్లా జాబితాపూర్‌కు చెందిన కాటిపెల్లి నిత్య (21), హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ ప్రాంతంలోని ఓ ప్రైవేట్ హాస్టల్‌లో ఉంటూ బీటెక్ మూడో సంవత్సరం చదువుతోంది.

ఇటీవల నిత్యను ఆమె స్నేహితురాళ్లు వైష్ణవి, సంజన చదువులో వెనుకబడ్డావంటూ అవమానించారట. దీనివల్ల తీవ్రంగా మనోవేదనకు గురైన నిత్య, జూలై 2న తన స్వగ్రామం వెళ్లిన తరువాత గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది.

ఆమెను కుటుంబ సభ్యులు వెంటనే కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతున్న నిత్య జూలై 4న మృతిచెందింది.

ఈ ఘటనపై నిత్య కుటుంబ సభ్యులు వైష్ణవి, సంజనలపై ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Rahul N

Recent Posts