
భారత ప్రభుత్వం సహకారం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ మద్దతుతో, విశాఖపట్నంలో 1 గిగావాట్ సామర్థ్యమున్న ఏఐ హబ్ ఏర్పాటు కోసం గూగుల్‌తో భాగస్వామ్యంలో ఎంఓయూ ఢిల్లీలోని తాజ్ మాన్‌సింగ్ హోటల్‌లో సంతకం అయింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర సమాచార, ప్రసార శాఖల మంత్రి అశ్వనీ వైష్టవ్, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్, అలాగే గూగుల్ క్లౌడ్ గ్లోబల్ సీఈఓ థామస్ కురియన్, బికాష్ కొలే (వైస్ ప్రెసిడెంట్, గ్లోబల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్), కరణ్ బజ్వా (ప్రెసిడెంట్, ఏషియా పసిఫిక్, గూగుల్ క్లౌడ్) పాల్గొన్నారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, ఐటీ, డిజిటల్ రంగాల్లో చంద్రబాబు గారి విజనరీ ఆలోచనలు, ముందుచూపుతో తీసుకొచ్చిన పాలసీలే గూగుల్ ప్రాజెక్టు సాకారం కావడానికి కారణమని తెలిపారు. ఐటీ, విద్య రెండు శాఖలను ఒకే మంత్రికి ఇచ్చి ఆంధ్రప్రదేశ్ లో డిజిటల్ ఇన్నోవేషన్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో నూతన అధ్యాయం రాసినట్లు నారా లోకేష్ చెప్పారు. ఈ ప్రాజెక్టు ఏపీని గ్లోబల్ టెక్ మ్యాప్‌పై నిలబెట్టడం సాధ్యమయ్యింది అని ఆయన అన్నారు.

నవ్యాంధ్రప్రదేశ్ యంగెస్ట్ స్టేట్‌గా ఉండి కూడా, దేశంలోనే హయ్యెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ స్టేట్‌గా ఎదగనున్నట్లు ఈ ప్రాజెక్టు సూచిస్తోంది. గూగుల్ సంస్థ ద్వారా దేశంలోనే తొలిసారిగా 15 బిలియన్ అమెరికన్ డాలర్ల (రూ.1.33 లక్షల కోట్లు) విదేశీ పెట్టుబడి రావడం ఈ ఒప్పందానికి చారిత్రాత్మక ఘనతను ఇస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు ఐటీ మంత్రి నారా లోకేష్ జంట సాధించిన ఈ ప్రాజెక్టు భారతదేశంలోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి (FDI) గా నిలిచింది.
విశాఖలో నెలకొల్పబోయే ఈ 1 గిగావాట్ సామర్థ్యమున్న ఏఐ హబ్ ద్వారా గ్లోబల్ డేటా ప్రాసెసింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్ మరియు క్లౌడ్ కంప్యూటింగ్ రంగాల్లో వేలాది ఉద్యోగాలు సృష్టించబడతాయి. ఈ ప్రాజెక్టు వల్ల ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తులో టెక్నాలజీ హబ్‌గా మారడం ఖాయం. చంద్రబాబు మరియు లోకేష్ డిజిటల్ డ్రీమ్‌ను వాస్తవముగా మార్చడం, ఆంధ్రప్రదేశ్‌ను గ్లోబల్ టెక్నాలజీ మ్యాప్‌పై నిలిపిన ఘనతా ఘట్టంగా ఈ ఎంఓయూ చరిత్రలో నిలుస్తుంది.
