Download App

జగన్ రాజకీయ వ్యభిచారం చేస్తున్నారు: షర్మిల

సెప్టెంబర్ 12, 2025 • By Rahul N
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కుమారుడు ఇంకా రాజకీయాల్లో అడుగుపెట్టకముందే వైసీపీ నేతలు ఈ స్థాయిలో రియాక్ట్ అవుతున్నారంటే అది భయమా? బెదురా? అన్న ప్రశ్నలు విసిరారు. “నా కుమారుడు రాజారెడ్డి అని స్వయంగా వైఎస్సార్ గారు నామకరణం చేశారు. ఆయన...
జగన్ రాజకీయ వ్యభిచారం చేస్తున్నారు: షర్మిల

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కుమారుడు ఇంకా రాజకీయాల్లో అడుగుపెట్టకముందే వైసీపీ నేతలు ఈ స్థాయిలో రియాక్ట్ అవుతున్నారంటే అది భయమా? బెదురా? అన్న ప్రశ్నలు విసిరారు. “నా కుమారుడు రాజారెడ్డి అని స్వయంగా వైఎస్సార్ గారు నామకరణం చేశారు. ఆయన నిజమైన వారసుడు. కానీ చంద్రబాబు చెప్పాడని నా కుమారుడు వస్తున్నాడని తప్పుడు ప్రచారం చేస్తున్నారు” అంటూ షర్మిల స్పష్టం చేశారు.

అంతేకాకుండా, ఉపరాష్ట్రపతి ఎన్నికల సమయంలో జగన్ బీజేపీ అభ్యర్థికి మద్దతు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తూ, “చంద్రబాబు చెబితేనే నా కుమారుడు వస్తున్నాడని మీరు అంటున్నారు. అయితే, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఆర్ఎస్సెస్ అభ్యర్థికి ఎవరు చెబితే మద్దతు ఇచ్చారో చెప్పండి. జగన్ స్వయంగా బీజేపీ అభ్యర్థికి మద్దతు ఇవ్వడం నిస్సిగ్గు పని” అంటూ మండిపడ్డారు.

షర్మిల ఇంకా తీవ్రంగా వ్యాఖ్యానిస్తూ, “టీడీపీ–జనసేన బహిరంగ పొత్తు చేస్తే, జగన్ మాత్రం బీజేపీతో రహస్య పొత్తు చేస్తున్నారు. ఇది నిజమైన రాజకీయ వ్యభిచారం. పక్క రాష్ట్రంలో బీఆర్‌ఎస్ పార్టీ ఎవరికీ మద్దతు ఇవ్వకుండా మౌనంగా ఉన్నారు. కానీ వైసీపీ మాత్రం బీజేపీకి బహిరంగ మద్దతు ఇచ్చింది. ఇది సిగ్గుచేటు. వైఎస్సార్ జీవితకాలం మొత్తం బీజేపీకి వ్యతిరేకంగా పోరాడారు. ఆయన బతికి ఉంటే, జగన్ చేసిన పనికి అవమానంతో తలదించుకునేవారు. చరిత్రలో జగన్ పేరు వైఎస్సార్ ఛాతీలో కత్తిపోటు చేసిన వాడిగా మిగిలిపోతుంది” అని ఫైరయ్యారు.

అంతటితో ఆగకుండా, “మీకు దమ్ముంటే బీజేపీ తోక పార్టీ అని ఒప్పుకోండి. లేదంటే బీజేపీ పేరునే పచ్చబొట్టుగా పొడిపించుకోండి” అంటూ జగన్‌కు నేరుగా సవాలు చేశారు.

షర్మిల ఈ తీవ్ర వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి చర్చ మొదలైంది. వైసీపీ ఇంకా అధికారికంగా స్పందించకపోయినా, షర్మిల మాటలు రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారమే రేపుతున్నాయి.

Trending Now

No trending articles in this category from the last 3 days.

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading